మెదక్: సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి జోస్యం చెప్పారు. బుధవారం స్థానిక సాయిక్రిష్ణ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న బీఆర్‌ఎస్ రాబోయే ఎన్నికలలో గెలవడం ఖాయమన్నారు. ఈనెల 23న మెదక్‌కు వస్తున్న సీఎం పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం జరిగే బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి 40వేల మందిని తరలించాలని మంత్రి హరీశ్‌రావు లక్ష్యంగా నిర్ణయించారని చెప్పారు.
సభను విజయవంతం చేసేందుకు నాయకులు కృషి చేయాలని కోరారు. నియోజకవర్గానికి మూడు వేల గృహలక్ష్మి ఇళ్లను కేటాయించారని, మరో రెండు వేల ఇళ్లను కేటాయించాలని మెదక్ సభలో సీఎంకు విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. రాష్ట్ర మహిళ కమిషన్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాల్గొనే మెదక్ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. జనా న్ని భారీగా తరలించాలని ఆమె కోరారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు.
నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చొరవతో నర్సాపూర్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని చెప్పారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్పారు. సమావేశానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, అసంఘటి త కార్మిక బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా జెడ్పీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, ప్యాక్స్ చైర్మన్ రాజుయాదవ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, వెంకట్‌రెడ్డి, శేకర్, అశోక్‌గౌడ్, శ్రీధర్‌గుప్తా, నయిం, సుధీర్‌రెడ్డి, భిక్షపతి, వీరేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment