న్యూఢిల్లీ: ఈ సీజన్‌లో తన అద్భుత ఫామ్ కొనసాగిస్తూ భారత యువ షట్లర్ లక్ష్య సేన్ ‘హ్యాట్రిక్’ సాధించాడు. వరుసగా మూడో అంతర్జాతీయ టోర్నమెంట్‌లో సింగిల్స్ టైటిల్ గెల్చుకున్నాడు. జర్మనీలోని సార్‌బ్రాకెన్‌లో ఆదివారం ముగిసిన సార్లర్‌లక్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నీలో ఈ ఉత్తరాఖండ్ షట్లర్ చాంపియన్‌గా నిలిచాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో లక్ష్య సేన్ 17–21, 21–18, 21–16తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా)పై గెలిచాడు. విజేత లక్ష్య సేన్‌కు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.3 లక్షల 96 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీకంటే ముందు లక్ష్యసేన్ డచ్ ఓపెన్, బెల్జియం ఓపెన్ టైటిల్స్ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment