చిట్టగాంగ్: న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ సొహాగ్ గాజి చెలరేగాడు. బ్యాటింగ్‌లో సెంచరీతో పాటు బౌలింగ్‌లో ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. దీంతో ఇరుజట్ల మధ్య ఆదివారం ముగిసిన తొలి టెస్టు ‘డ్రా’ అయ్యింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం సమంగా ఉంది. 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి రోజు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 48.2 ఓవర్లలో 3 వికెట్లకు 173 పరుగులు చేసింది.
అంతకుముందు 117/1 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌ను 90 ఓవర్లలో 7 వికెట్లకు 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓ దశలో 260/4 స్కోరుతో పటిష్టంగా ఉన్న కివీస్‌ను గాజి దెబ్బతీశాడు. 85వ ఓవర్‌లో రెండో, మూడో, నాలుగో బంతికి వరుసగా అండర్సన్ (8), వాట్లింగ్ (0), బ్రేస్‌వెల్ (0)లను పెవిలియన్‌కు చేర్చాడు. చివరకు 287 పరుగుల వద్ద కివీస్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన రెండో బంగ్లా బౌలర్‌గా గాజి రికార్డులకెక్కాడు.
బంగ్లాదేశ్, కివీస్ తొలి టెస్టు ‘డ్రా’
Published Mon, Oct 14 2013 12:26 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM
Advertisement
Advertisement