ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ హ్యాట్రిక్‌.. వీడియో వైరల్‌ | BAN Vs SL: Mumbai Indias New Recruit Nuwan Thusahara picks T20I Hat-trick Ahead Of IPL 2024, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024: ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ హ్యాట్రిక్‌.. వీడియో వైరల్‌

Published Sat, Mar 9 2024 5:56 PM | Last Updated on Sat, Mar 9 2024 6:29 PM

Nuwan Thusahara picks T20I hat-trick ahead of IPL 2024 - Sakshi

సెల్హాట్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20లో శ్రీలంక పేసర్‌ నువాన్‌ తుషారా హ్యాట్రిక్‌ వికెట్లతో చెలరేగాడు. అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టిన ఐదో శ్రీలంక బౌలర్‌గా నువాన్‌ రికార్డులకెక్కాడు. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 4 ఓవర్‌లో తుషారా ఈ ఘనత సాధించాడు. ఆ ఓవర్‌లో రెండో బంతికి నజ్ముల్‌ హోస్సేన్‌ షాంటోను తుషారా క్లీన్‌ బౌల్డ్‌ చేయగా.. మూడో బంతికి హృదయ్‌, నాలుగో బంతికి మహ్మదుల్లాను తుషారా పెవిలియన్‌కు పంపాడు.

దీంతో తుషారా తొలి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను శ్రీలంక క్రికెట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కాగా ఐపీఎల్‌-2024 వేలంలో తుషార్‌ను ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. రూ.4.8 కోట్లకు అతడిని ముంబై ఫ్రాంచైజీ దక్కించుకుంది.
చదవండి#Sarfaraz: తెగ మిడిసిపడుతున్నాడు.. గిల్‌- బెయిర్‌స్టో గొడవలో సర్ఫరాజ్‌.. వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement