విండీస్‌ విజయం | West Indies beat Bangladesh by 7 wickets in 1st T20 | Sakshi
Sakshi News home page

విండీస్‌ విజయం

Published Thu, Aug 2 2018 12:58 AM | Last Updated on Thu, Aug 2 2018 12:58 AM

West Indies beat Bangladesh by 7 wickets in 1st T20 - Sakshi

సెయింట్‌ కిట్స్‌: వన్డే సిరీస్‌ కోల్పోయిన వెస్టెండీస్‌ పొట్టి ఫార్మాట్‌లో సత్తా చాటింది. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో మంగళవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన తొలి టి20లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. విండీస్‌ బౌలర్లు కెరిక్‌ విలియమ్స్‌ (4/28), నర్స్‌ (6/2), కీమో పాల్‌ (24/2) ధాటికి మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది.

మహ్మదుల్లా (27 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌స్కోరర్‌. మ్యాచ్‌కు వరణుడు అడ్డుపడటంతో విండీస్‌ లక్ష్యాన్ని 11 ఓవర్లలో 91గా కుదించారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రసెల్‌ (21 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), శామ్యూల్స్‌ (13 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగడంతో విండీస్‌ 9.1 ఓవర్లలో 3 వికెట్లకు 93 పరుగులు చేసి విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్‌ ఆదివారం జరుగనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement