
మాంచెస్టర్: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (61 బంతుల్లో 102; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. కియా టి20 మహిళల సూపర్ లీగ్‌లో వెస్టర్న్ స్ట్రామ్స్ తరఫున ఆడుతున్న మంధాన... లాంకషైర్ థండర్‌పై 60 బంతుల్లోనే సెంచరీ కొట్టింది.
దీంతో స్ట్రామ్స్ జట్టు 154 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించింది. అంతకుమందు లాంకషైర్ థండర్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 153 పరుగులు చేసింది. లాంకషైర్ తరఫున ఆడుతున్న భారత టి20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (0) విఫలమైంది. అయితే శాటర్త్‌వైట్ (57 బంతుల్లో 85 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాటంతో లాంకషైర్ మోస్తరు స్కోరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment