ఆఖరి టి20లో పాకిస్తాన్‌కు ఊరట విజయం | A comfortable victory for Pakistan in the final T20 | Sakshi
Sakshi News home page

ఆఖరి టి20లో పాకిస్తాన్‌కు ఊరట విజయం

Published Mon, Jan 22 2024 4:16 AM | Last Updated on Mon, Jan 22 2024 4:16 AM

A comfortable victory for Pakistan in the final T20 - Sakshi

న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ కాకుండా పాకిస్తాన్‌ తప్పించుకుంది. శనివారం జరిగిన ఐదో టి20లో పాక్‌ 42 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ముందుగా పాక్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మొహమ్మద్‌ రిజ్వాన్‌ (38), ఫఖర్‌ జమాన్‌ (33) రాణించారు.

కివీస్‌ బౌలర్లలో సౌతీ, ఇష్‌ సోధి, ఫెర్గూసన్, హెన్రీ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్‌ 17.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. సొంతగడ్డపై కివీస్‌కు టి20ల్లో ఇది రెండో అత్యల్ప స్కోరు. ఫిలిప్స్‌ (26), అలెన్‌ (22) మాత్రమే ఫర్వాలేదనిపించారు.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇఫ్తికార్‌ అహ్మద్‌ (3/24) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. 275 పరుగులు సాధించిన అలెన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. తొలి నాలుగు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్‌ 4–1తో సిరీస్‌ గెలుచుకుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement