పాకిస్తాన్‌ క్లీన్‌స్వీప్‌ | Dramatic collapse helps Pakistan secure T20I clean sweep against New Zealand | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ క్లీన్‌స్వీప్‌

Published Tue, Nov 6 2018 2:50 AM | Last Updated on Tue, Nov 6 2018 2:50 AM

Dramatic collapse helps Pakistan secure T20I clean sweep against New Zealand - Sakshi

దుబాయ్‌: టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ జట్టు పాకిస్తాన్‌ స్థాయికి తగ్గ ఆటతో న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. మూడో టి20లోనూ కివీస్‌ను ఓడించి 3–0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత పాక్‌ మూడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ఓపెనర్‌ బాబర్‌ ఆజమ్‌ (58 బంతుల్లో 79; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), హఫీజ్‌ (34 బంతుల్లో 53; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించారు.

ఛేదనలో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (38 బంతుల్లో 60; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఓపెనర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ (26) మినహా మరెవరూ నిలవకపోవడంతో కివీస్‌ 16.5 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. షాదాబ్‌ ఖాన్‌ (3/30), వకాస్‌ మక్సూద్‌ (2/21), ఇమాద్‌ వసీం (2/28) ప్రత్యర్థిని దెబ్బతీశారు. హఫీజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement