టి20లోనూ  దక్షిణాఫ్రికా గెలుపు | Australia win toss and bowl in T20 versus South Africa | Sakshi
Sakshi News home page

టి20లోనూ  దక్షిణాఫ్రికా గెలుపు

Nov 18 2018 2:46 AM | Updated on Nov 18 2018 2:46 AM

Australia win toss and bowl in T20 versus South Africa - Sakshi

కరారా: ఏకైక టి20లో 21 పరుగుల విజయంతో దక్షిణాఫ్రికా... ఆస్ట్రేలియా పర్యటనను ముగించింది. రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 10 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌ (16 బంతుల్లో 22; 2 సిక్స్‌లు), రీజా హెన్‌డ్రిక్స్‌ (8 బంతుల్లో 19; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ డు ప్లెసిస్‌ (15 బంతుల్లో 27; 4 ఫోర్లు) వేగంగా ఆడారు.

ఆండ్రూ టై (2/18), కౌల్టర్‌నైల్‌ (2/19)లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో 10 ఓవర్లలో ఆసీస్‌ 7 వికెట్లు కోల్పోయి 87 పరుగులే చేయగలిగింది. మ్యాక్స్‌వెల్‌ (23 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిలిచినా... ఓపెనర్లు కెప్టెన్‌ ఫించ్‌ (7), క్రిస్‌ లిన్‌ (14) సహా డీఆర్సీ షార్ట్‌ (0), స్టొయినిస్‌ (5) విఫలమవడంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. ఇంతకుముందు జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కూడా సఫారీలు 2–1తో కైవసం చేసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement