లాహోర్: అంతర్జాతీయ టి20ల్లో ఎదురవుతోన్న వరుస పరాజయాలకు పాకిస్తాన్ ఫుల్‌స్టాప్ పెట్టింది. బంగ్లాదేశ్‌తో శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 141 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (39; 4 ఫోర్లు, సిక్స్), మొహమ్మద్ నైమ్ (43; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. అనంతరం ఛేదనకు దిగిన పాకిస్తాన్ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది.
పునరాగమనంలో తొలి టి20 ఆడుతున్న పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ (45 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించడంతో... పాక్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. మాలిక్ చివరి టి20ని 2019 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో ఆడాడు. ఈ మ్యాచ్ ద్వారా పాకిస్తాన్ తరఫున హసన్ అలీ, హరీస్ రౌఫ్‌లు టి20ల్లో అరంగేట్రం చేశారు. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా రెండో టి20 ఇక్కడే నేడు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment