
ప్రావిడెన్స్ (గయానా): ఏడేళ్ల తర్వాత వెస్టిండీస్ చేతిలో భారత్ వరుసగా రెండు టి20 మ్యాచ్‌లలో ఓడింది. ఇప్పుడు అదే తరహాలో సిరీస్ కూడా కోల్పోయే స్థితిలో టీమిండియా నిలిచింది. రోహిత్, కోహ్లి లేకపోయినా ఐపీఎల్ కారణంగా తగినంత టి20 అనుభవం ఉన్న భారత జట్టు తొలి రెండు మ్యాచ్‌లలో ప్రత్యరి్థకి అనూహ్యంగా తలవంచింది. ఇప్పుడైనా హార్దిక్ పాండ్యా బృందం కోలుకొని తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరుస్తుందా అనేది కీలకం. మరోవైపు రెండు మ్యాచ్‌లు గెలిచిన ఉత్సాహంతో వెస్టిండీస్ సిరీస్‌పై కన్నేసింది. ఆ జట్టు ఇదే జోరు కొనసాగిస్తే మరో మ్యాచ్ గెలవడం కూడా కష్టం కాబోదు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు మూడో టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. గత మ్యాచ్ జరిగిన వేదికపైనే ఈ మ్యాచ్ కూడా కావడంతో పిచ్ నెమ్మదిగా ఉండవచ్చు.
సూర్య చెలరేగేనా...
తొలి రెండు టి20ల్లోనూ భారత ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. బ్యాటింగ్‌కు గొప్పగా అనుకూలించని నెమ్మదైన పిచ్‌పై పరుగులు చేసేందుకు మనవాళ్లు తడబడుతున్నారు. ఇషాన్ కిషన్, గిల్, సంజు సామ్సన్, హార్దిక్ పాండ్యా ప్రభావం చూపలేకపోయారు. దీంతోపాటు టి20ల్లో అద్భుత రికార్డు ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా తనదైన దూకుడు ప్రదర్శించలేదు. హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ ఒక్కడే చక్కటి బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో స్పిన్నర్ చహల్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోగా, అర్‡్షదీప్, ముకేశ్ కుమార్ నిరాశపరిచారు. పాండ్యా కెపె్టన్సీ కూడా పేలవంగా ఉంది. గత మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌కు బౌలింగ్ ఇవ్వకపోగా, కీలకదశలో చహల్‌కు బౌలింగ్ ఇవ్వకుండా విండీస్ గెలిచే అవకాశం సృష్టించాడు. ఈ తప్పులను దిద్దుకుంటేనే భారత్ గెలుపు బాట పట్టగలదు.
వారిద్దరిపై భారం...
వెస్టిండీస్ రెండుసార్లూ చక్కటి బౌలింగ్ ప్రదర్శనలతో మ్యాచ్‌లను సొంతం చేసుకోగలిగింది. పటిష్టమైన భారత లైనప్‌ను నిలువరించడంలో ఆ జట్టు సఫలమైంది. ముఖ్యంగా అకీల్ హొసీన్, మెకాయ్, జోసెఫ్‌లు నియంత్రణతో బౌలింగ్ చేస్తున్నారు. హోల్డర్ కూడా కీలక దశలో రాణించడం ఆ జట్టుకు సానుకూలాంశం. బ్యాటింగ్‌లో తన విలువేమిటో పూరన్ చూపించాడు. హెట్‌మైర్ కూడా జట్టు బ్యాటింగ్‌లో కీలకం. ఈ ఇద్దరు ఐపీఎల్ అనుభవం ఉన్న ఆటగాళ్లు జట్టును ఒంటిచేత్తో గెలిపించగల సమర్థులు. అదే తరహాలో మేయర్స్ కూడా రాణించాలని టీమ్ కోరుకుంటోంది. మొత్తంగా చూస్తే ఈ ఫార్మాట్‌లో అంత సులువుగా తలవంచమని చూపిన విండీస్ సిరీస్ గెలుపుపై దృష్టి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment