
ఉప్పల్ మైదానం టి20 ఫైట్‌కు సిద్ధమైంది. భారత్, వెస్టిండీస్‌ల మధ్య శుక్రవారం జరగనున్న తొలి మ్యాచ్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.గురువారం స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ వారితో సరదాగా మాట్లాడారు. రోహిత్ శర్మ,యజువేంద్ర చహల్, రిషబ్‌పంత్‌లతో ముచ్చటించిన ఈ భారత మాజీ కెప్టెన్‌యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేశారు.