![Google CEO Sundar Pichai Dials Donald Trump Elon Musk Joins The Call](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/11/21/Sundar.jpg.webp?itok=7Ix5xNZF)
ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌నకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కాల్ చేశారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనందకు ట్రంప్‌నలకు అభినందనలు తెలిపారు. అయితే వీరి సంభాషణలో టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలాన్ మాస్క్ చేరారు.
గతంలో గూగుల్‌లో సెర్చ్ విషయంలో తప్పుడుగా చూపిస్తున్నట్లు మస్క్ ఆరోపణలు చేశారు. ట్రంప్ కోసం సెర్చ్ చేస్తే, కమలా హారిస్‌కు సంబంధించిన వార్తలు వస్తున్నాయని, కానీ హారిస్ కోసం సెర్చ్ చేస్తే ట్రంప్ సమాచారం రావడం లేదని ఓ యూజర్ తెలపగా.. దానిని మస్క్ రీట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా.. పిచాయ్, ట్రంప్, మస్క్ టెలిఫోన్ సంభాషణపై ఆసక్తి నెలకొంది. మరి ఈ ముగ్గురి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో తెలియరాలేదు.
కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య సంబంధాలు బలపడిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల ముందు మస్క్ ప్రపంచ నాయకులతో టెలిఫోన్ కాల్‌లో మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి పలు సలహాలు అందించారు. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా మారడంతో మాస్క్‌ను అందరూ ‘ఫస్ట్ బడ్డీ’గా పిలుస్తుంటారు.
ఈ క్రమంలో స్పేస్ ఎక్స్‌కు చెందిన ఓ భారీ స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగాన్ని వీరిద్దరూ ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే, ఇందులో ఒక దశ విఫలమవ్వగా.. రెండో దశ విజయవంతమైంది. ట్రంప్ కేబినెట్‌లో మస్క్ 'ప్రభుత్వ సమర్థత విభాగానికి(అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) నాయకత్వం వహించబోతున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ప్రచార సమయంలోనే వెల్లడించాడు. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామితో కలిసి మస్క్ ఈ విభాగానికి అధిపతిగా ఉండనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment