విద్యార్థులూ... రిస్క్ తీసుకోండి: పిచాయ్
న్యూఢిల్లీ: రిస్క్ తీసుకోవడానికి ముందుకు రావాలని విద్యార్థులకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పిలుపునిచ్చారు. అకడమిక్ చదువుల కంటే క్రియేటివిటీ ముఖ్యమని పేర్కొన్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని శ్రీరాం కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులారా కాసింత రిస్క్ తీసుకోండి. రిస్క్ వల్ల ఇబ్బందులతో పాటు విజయం కూడా వస్తుంది. వచ్చే తరానికి క్రియేటివిటీ అన్నదే ప్రధానాంశం. చదువుల కంటే సృజన ముఖ్యం. ఉద్యోగాలు చేయడం గురించి కాదు, ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగేలా ఆలోచనలు ఉండాలి. చదువైపోగానే ఓ కొత్త కంపెనీ ప్రారంభించాలన్న తపన ఉండాలి. ఇండియాలో స్టార్ ఆప్ కల్చర్ పెరుగుతోంది. దేశంలో ఎంతమంది డెవలపర్లు ఉంటే అన్ని పరిష్కారాలు దొరుకుతాయి. పాఠశాలల్లో కోడింగ్ ను తప్పనిసరి చేయాలి' అన్నారు. ఇండియా చాలా మారిందని అన్నారు. సిలికాన్ వ్యాలీకి, ఢిల్లీకి తేడా లేదని పేర్కొన్నారు.