Sriram College
-
‘ఐశ్యర్యకి ఫోన్ కూడా కొనివ్వలేకపోయాం’
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక ఇబ్బందులే తమ కూతుర్ని పొట్టనపెట్టుకున్నాయని షాద్‌నగర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్యారెడ్డి తల్లిదండ్రులు శ్రీనివాస్‌రెడ్డి, సుమతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆన్లైన్ క్లాసులు వినడానికై కనీసం తమ కూతురికి ఫోన్ కూడా కొనివ్వలేకపోయామని కన్నీరుమున్నీరయ్యారు. సోమవారం వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘:ఐశ్యర్య మొదటి నుంచి చదువులో ఎంతో ముందుండేది. ఉన్నత చదువు కోసం అప్పు చేసి మరీ ఆమెను ఢిల్లీకి పంపించాం. కూతుర్ని ఐఏఎస్ చేయడం కోసం చివరకు మా ఇంటిని కూడా తాకట్టు పెట్టాం. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ క్లాసులు వినడం కోసం ఫోన్ లేదా ల్యాప్‌టాప్ అడిగింది. మా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఫోన్ కూడా కొనివ్వలేకపోయాం. చనిపోయే ముందు కూడా ఐశ్యర్య మా అందరితో కలివిడిగానే మాట్లాడింది. స్కాలర్షిప్ రాకపోవడం ఐశ్యర్యను మరింత కుంగదీసింది. గతంలో మా కూతురు టాపర్‌గా నిలిచినప్పుడు ఎందరో అండగా ఉంటామని ముందుకు వచ్చారు, కానీ కొద్దిరోజులకే ముఖం చాటేశారు. మాకొచ్చిన బాధ ఏ తల్లిదండ్రులకు రావొద్దు’ అని ఐశ్యర్య తల్లిదండ్రులు భోరున విలపించారు. ప్రభుత్వం ఆదుకొని తమ చిన్న కూతురు చదువుకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి : ఐశ్వర్య ఆత్మహత్య.. రాహుల్ స్పందన) షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీ యాజమాన్యం హాస్టల్ ఖాళీ చేయించింది. ఈ క్రమంలో షాద్‌నగర్ వచ్చిన ఐశ్వర్య ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబానికి భారం కాకుడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో తెలిపింది. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే ఐశ్వర్య యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కాలర్షిప్ కింద బీఎస్సీ (హన్స్) గణితం చదవడానికి ఎల్‌ఎస్‌ఆర్‌లో చేరింది. ఇక ఈ ఏడాది మార్చి నుంచి స్కాలర్షిప్ రాకపోవడంతో పుస్తకాలు, హస్టల్ ఫీజు వంటి ఇతర ఖర్చులకు ఇబ్బంది తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. -
ఇది నిజం! ఇదే నిజం!!: రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా హస్టల్ యాజమాన్యం బలవంతంగా ఖాళీ చేయించడంతో మనస్తాపానికి గురైన షాద్‌నగర్ డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్య ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఐశ్వర్య కుటుంబానికి తన సంతాపం తెలిపారు. బీజేపీ అనాలోచితంగా విధించిన లాక్డౌన్ దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను నాశనం చేసిందని మండి పడ్డారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. "ఈ విచారకరమైన క్షణంలో విద్యార్థి ఐశ్వర్య కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. బీజేపీ అనాలోచితంగా చేసిన నోట్ల రద్దు, లాక్డౌన్ దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది. ఇది నిజం” అని రాహుల్ ట్వీట్ చేశారు. (చదవండి: స్కూల్ ఫీజుకు బదులుగా కొబ్బరి బొండాలు..!) ఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం తెలుపుతున్నాను. ఉద్దేశ పూర్వకంగా చేసిన నోట్ల రద్దు మరియు లాక్డౌన్ ద్వారా, బీజేపి ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది. ఇది నిజం! ఇదే నిజం!! pic.twitter.com/mSszEES6ha — Rahul Gandhi (@RahulGandhi) November 9, 2020 షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీ యాజమాన్యం హాస్టల్ ఖాళీ చేయించింది. ఈ క్రమంలో షాద్‌నగర్ వచ్చిన ఐశ్వర్య ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబానికి భారం కాకుడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో తెలిపింది. ఇప్పటికే తన చదువు కోసం తల్లిదండ్రులు ఇంటిని తనఖా పెట్టారన్నది. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే ఐశ్వర్య యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కాలర్షిప్ కింద బీఎస్సీ (హన్స్) గణితం చదవడానికి ఎల్‌ఎస్‌ఆర్‌లో చేరింది. ఇక ఈ ఏడాది మార్చి నుంచి స్కాలర్షిప్ రాకపోవడంతో పుస్తకాలు, హస్టల్ ఫీజు వంటి ఇతర ఖర్చులకు ఇబ్బంది తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. -
విద్యార్థులూ... రిస్క్ తీసుకోండి: పిచాయ్
న్యూఢిల్లీ: రిస్క్ తీసుకోవడానికి ముందుకు రావాలని విద్యార్థులకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పిలుపునిచ్చారు. అకడమిక్ చదువుల కంటే క్రియేటివిటీ ముఖ్యమని పేర్కొన్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని శ్రీరాం కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులారా కాసింత రిస్క్ తీసుకోండి. రిస్క్ వల్ల ఇబ్బందులతో పాటు విజయం కూడా వస్తుంది. వచ్చే తరానికి క్రియేటివిటీ అన్నదే ప్రధానాంశం. చదువుల కంటే సృజన ముఖ్యం. ఉద్యోగాలు చేయడం గురించి కాదు, ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగేలా ఆలోచనలు ఉండాలి. చదువైపోగానే ఓ కొత్త కంపెనీ ప్రారంభించాలన్న తపన ఉండాలి. ఇండియాలో స్టార్ ఆప్ కల్చర్ పెరుగుతోంది. దేశంలో ఎంతమంది డెవలపర్లు ఉంటే అన్ని పరిష్కారాలు దొరుకుతాయి. పాఠశాలల్లో కోడింగ్ ను తప్పనిసరి చేయాలి' అన్నారు. ఇండియా చాలా మారిందని అన్నారు. సిలికాన్ వ్యాలీకి, ఢిల్లీకి తేడా లేదని పేర్కొన్నారు.