టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలా ? లేక ఆఫీసుకు రావాలా అనే విషయంలో కొన్నాళ్లుగా కొనసాగుతున్న సందిగ్థతకు తెరదించింది. ఈ రెండింంటికీ మధ్యే మార్గంగా కొత్త విధానం అమల్లోకి తేబోతున్నట్టు ఆ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు.
కరోనా సంక్షోభం మొదలైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పని విధానాల్లో మార్పులు వచ్చాయి. కోవిడ్ నిబంధనల కారణంగా ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగులు సైతం ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్నారు. దాదాపు ఏడాది కాలంగా ఇదే పద్ధతిని అనేక పెద్ద కంపెనీలు కొనసాగిస్తున్నాయి. వర్క్‌ఫ్రం హోంకి స్వస్తి పలికి ఆఫీసులకు రావాలంటూ ఆదేశాలు ఇచ్చేందుకు దాదాపు అన్ని కంపెనీలు సిద్ధం అవుతుండగా కోవిడ్ సెంకండ్ వేవ్ ప్రపంచాన్ని చుట్టేసింది.
కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం వేగంగా జరుగుతోంది. దీంతో ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని పిలించేందుకు అనేక కంపెనీలు రెడీగా ఉన్నాయి. అయితే థర్డ్‌వేర్ భయం ముంగింట ఉండటంతో ఉద్యోగులను ఆఫీసులకు పిలించేందుకు ముందు వెనుకా ఆలోచిస్తున్నాయి.
కొత్తగా ఫ్లెక్సిబుల్ మెథడ్..!
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో విస్తరించిన గూగుల్ సంస్థ ఉద్యోగుల పని విధానం విషయంలో కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఇటు పూర్తిగా వర్క్‌ఫ్రం హోం కాకుండా అటూ రెగ్యులర్ పద్దతిలో ఉద్యోగులను ఆఫీసులకు రమ్మనకుండా ఫ్లెక్సిబుల్ వర్క్ వీక్ మెథడ్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ముందుగా ఈ విధానం అమెరికాలో అమలు చేసి ఆ తర్వాత ఇతర దేశాలకు విస్తరించనున్నారు.
ప్రస్తుతం అమెరికాలో ఐదు రోజుల పని విధానం అమల్లో ఉంది. దీంతో ఉద్యోగులు ఐదు రోజులు మాత్రమే పని చేస్తున్నారు. కొత్త విధానం ప్రకారం ఉద్యోగులు మూడు రోజులు ఇళ్ల నుంచి పని చేస్తే రెండు రోజులు ఆఫీసుకు వచ్చి పని చేయాల్సి ఉంటుంది. గూగుల్ సీఈవో సుంచర్ పిచయ్ ఈ వర్క్ విధానాన్ని టూ బై త్రీ (2/3) మోడల్‌గా పేర్కొంటున్నారు. ‘ఏడాది కాలంగా ఉద్యోగులు ఇళ్ల నుంచే పని చేయడానికి అలవాటు పడ్డారు, దీంతో చాలా మంది నగరాలకు దూరంగా రిమోట్ ఏరియాల్లో పని చేస్తున్నారు. ఇప్పుడు ఆఫీసులకు రావాలంటే వీరంతా చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీని వల్ల శారీరక, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీన్ని దూరం చేసేందుకు టై బై త్రీ మోడల్‌ని అమలు చేయాలని నిర్ణయించాం’ అని పిచాయ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment