
ఈ ఏడాది పూర్తవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. 2018 తమకు మిగిల్చిన తీపి ఙ్ఞాపకాలను, చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు.. మనలో చాలా మంది ఇప్పటినుంచే ప్రిపరేషన్స్ మొదలుపెట్టేసి ఉంటారు కూడా. ఈ నేపథ్యంలో 2018లో అత్యధిక మంది నెటిజన్లు ఎక్కువగా దేని గురించి వెదికారో అన్న దానిపై గూగుల్ ఓ వీడియోను విడుదల చేసింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. యూట్యూబ్ విడుదల చేసిన ఆన్యువల్ రివైండ్ వీడియో కంటే కూడా గూగుల్ వీడియోనే సూపర్బ్‌గా ఉందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంతకీ గూగుల్‌లో ఎక్కువ మంది వెదికింది దేనికోసం అంటే...‘మంచి’ కోసం. అవును మీరు చదివింది నిజమే. గుడ్ సింగర్, డ్యాన్సర్, కిస్సర్ ఇలా ప్రతీవిషయంలో గుడ్ అనిపించుకోవడానికి ఏం చేయాలా అని నెటిజన్లు సెర్చ్ చేశారట. ఇయర్‌ఇన్‌సర్చ్ పేరిట విడుదల చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంకేం మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
In a year of ups and downs, the world searched for "good" more than ever before. Here’s to all the good moments from 2018 and all the people who searched for them. #YearInSearch https://t.co/hj2FnX4mR4
— Sundar Pichai (@sundarpichai) December 12, 2018
Comments
Please login to add a commentAdd a comment