'సుందర్... మీ కాలేజీని సందర్శించండి' | Mamata Banerjee hopes Sundar Pichai visits IIT Kharagpur | Sakshi
Sakshi News home page

'సుందర్... మీ కాలేజీని సందర్శించండి'

Published Wed, Aug 12 2015 5:14 PM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM

'సుందర్... మీ కాలేజీని సందర్శించండి'

'సుందర్... మీ కాలేజీని సందర్శించండి'

కోల్ కతా: గూగుల్ సీఈఓగా నియమితులైన సుందర్ పిచాయ్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. ఐఐటీ ఖరగ్ పూర్ ను సందర్శించాలని ఆకాంక్షించారు.

'సుందర్ పిచాయ్ కు అభినందనలు. మీరు స్ఫూర్తి ప్రదాత. ఐఐటీ ఖరగ్ పూర్ లో మీరు విద్య అభ్యసించడం మాకెంతో గర్వకారణం. మీరు చదువుతున్న కాలేజీని త్వరలోనే సందర్శిస్తారని ఆశిస్తున్నాం' అని మమత ట్వీట్ చేశారు.

1993లో అమెరికా వెళ్లడానికి ముందు సుందర్ పిచాయ్... ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. కాగా, గూగుల్ సీఈఓగా ఎంపికైన సుందర్ పిచాయ్ కు అభినందనలు తెలిపేందుకు ఐఐటీ ఖరగ్ పూర్ ప్రత్యేకంగా ఫేస్ బుక్ లో పేజీలో ప్రారంభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement