‘చివరిసారి ఏం మాట్లాడామంటే..’ | sundar pichai revealed last conversation with ratan tata | Sakshi
Sakshi News home page

‘చివరిసారి ఏం మాట్లాడామంటే..’

Published Thu, Oct 10 2024 11:47 AM | Last Updated on Thu, Oct 10 2024 12:39 PM

sundar pichai revealed last conversation with ratan tata

రతన్ టాటా మృతిపట్ల ప్రముఖులు వివిధ మాధ్యమాల ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగా గూగుల్‌, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ రతన్‌ టాటాతో చివరిసారిగా గడిపిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఈసందర్భంగా ఆయన తన ఎక్స్‌ ఖాతాలో ఆ వివరాలు పంచుకుంటూ టాటా మృతికి సంతాపం తెలియజేశారు.

‘గూగుల్‌ క్యాంపస్‌లో రతన్ టాటాను చివరిసారి కలిసినప్పుడు ‘వేమో’(అధునాతన అటానమస్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీ) పురోగతి గురించి మాట్లాడాం. ఈ విభాగంలో ఆయన ఆలోచన విధానాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అసాధారణమైన వ్యాపార, దాతృత్వ వారసత్వం ఆయన సొంతం. భారతదేశంలో ఆధునిక వ్యాపార నాయకత్వానికి మార్గదర్శకత్వం చేయడంలో రతన్‌ టాటా కీలకపాత్ర పోషించారు. భారత్‌ను ఆర్థికంగా మరింత మెరుగుపరిచేందుకు ఆయన ఎంతో శ్రద్ధ చూపారు. అతని మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని సుందర్‌ తెలిపారు.

రతన్ టాటాపై ఇలోన్‌మస్క్

టాటా ప్రపంచ ప్రఖ్యాత సంస్థల సారథులకు స్ఫూర్తిగా నిలిచారు. అమెరికన్ జర్నలిస్ట్ చార్లీ రోస్‌తో 2009లో ఇలోన్‌మస్క్‌తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో రతన్‌ టాటా దూరదృష్టిని మస్క్‌ ప్రశంసించారు. ఇంటర్వ్యూలో భాగంగా భారతీయ మార్కెట్‌లో టాటా తక్కువ ధరకే కారు(నానో) అందిస్తున్నారని మస్క్‌ దృష్టికి తీసుకొచ్చారు. ‘రతన్ టాటా ఇండియాలో విప్లవాత్మక మార్పునకు తెరతీశారు. కేవలం రూ.ఒక లక్షకు కారు అందించడం గొప్ప విషయం. కారు సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే దూరదృష్టి టాటాది’ అని మస్క్‌ బదులిచ్చారు.

రతన్ టాటాపై బిల్ గేట్స్

‘రతన్ టాటా దూరదృష్టి కలిగిన నాయకుడు, సామాన్యుల జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం ఎనలేనిది. అతడి వ్యక్తిత్వం భారతదేశం, ప్రపంచంపై చెరగని ముద్ర వేసింది. ప్రజలకు సేవ చేసేందుకు రతన్‌ టాటాతో కలిసి అనే సందర్భాల్లో వివిధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. అతడి మరణం రాబోయే తరాలకులోటు. కానీ అతడు అనుసరించిన విలువలు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి’ అని బిల్‌గేట్స్‌ తెలిపారు.

ఇదీ చదవండి: సినీనటి సంతాపం.. అప్పట్లో ఇద్దరి మధ్య ప్రేమ?

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా, ముఖేష్‌ అంబానీ వంటి వ్యాపార ప్రముఖులు, రాజకీయ, సినీ దిగ్గజాలు ఆయనకు సంతాపం తెలిపారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో టాటా తుది శ్వాస విడిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement