'ప్రపంచాన్ని మార్చే శక్తి ఆయనకు ఉంది' | PM Modi will change the world, says John Chambers | Sakshi
Sakshi News home page

'ప్రపంచాన్ని మార్చే శక్తి ఆయనకు ఉంది'

Published Sun, Sep 27 2015 8:30 AM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM

'ప్రపంచాన్ని మార్చే శక్తి ఆయనకు ఉంది'

'ప్రపంచాన్ని మార్చే శక్తి ఆయనకు ఉంది'

శాన్ జోసె: ప్రపంచాన్ని, భారత్ ను మార్చే శక్తి ప్రధాని నరేంద్ర మోదీకి ఉందని సిస్కో సిస్టమ్స్ సీఈవో జాన్ చాంబర్స్ అభిప్రాయపడ్డారు. మోదీకి గ్లోబల్ విజన్ ఉందని, ప్రపంచ పరిణామాలపై ఆయనకు అవగాహన ఉందని అన్నారు. కాలిఫోర్నియాలోని శాన్ జోసెలో ఐటీ దిగ్గజ కంపెనీల సీఈవోలతో నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు సీఈవోలు మోదీని ప్రశంసలతో ముంచెత్తారు.

మోదీ అమెరికాకు రావడం తమకెంతో ఆనందంగా ఉందని ఎడోబ్ సీఈవో శంతను నారాయణ్ అన్నారు. భారతదేశ వ్యాప్తంగా చవకైన బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. మోదీతో భేటీ అయిన వారిలో గూగుల్ సీఈవో సుందర్ పిచ్చై, యాపిల్ సీఈవో టిమ్ కుక్, టిఐఈఎస్ సీఈవో వెంక్ శుక్లా తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement