
2015లో పిచాయ్ అందుకున్న జీతమెంతో తెలుసా?
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన గూగుల్ పిచాయ్ 2015లో జీతభత్యాల కింద అక్షరాల రూ. 667 కోట్లు (100.5 మిలియన్ డాలర్లు) అందుకున్నారు.
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ 2015లో జీతభత్యాల కింద అక్షరాల రూ. 667 కోట్లు (100.5 మిలియన్ డాలర్లు) అందుకున్నారు. గడిచిన ఏడాది ఆయనకు జీతం కింద 652,500 డాలర్లు (రూ. 4.32కోట్లు) లభించగా, రిస్ట్రిక్టెడ్ వాటాల రూపంలో 99.8 మిలియన్ డాలర్ల (రూ. 662 కోట్లు) మొత్తం లభించాయి. ఈ వాటాలను 2017 తర్వాత పూర్తిస్థాయిలో డబ్బు రూపంలో మార్చుకోవచ్చు. ఇక ఇతర భత్యాల రూపంలో 22,935 డాలర్లు పిచాయ్‌కు అందాయి. రెగ్యూలేటరీ ఫిల్లింగ్స్ ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి.
2015 ఆగస్టులో గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్ బాధ్యతలు స్వీకరించారు. మాతృసంస్థ ఆల్పాబెట్ గొడుగు కింద గూగుల్ సంస్థలన్నింటినీ పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. గతంలో గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ బాధ్యతలు చూసుకున్న పిచాయ్ గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టడంతో ఆయనకు గత ఫిబ్రవరిలో 199 మిలియన్ డాలర్ల (1,320 కోట్లు) రిస్ట్రిక్టెడ్ వాటాలను బహుమతిగా అందించింది.
ప్రాడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా 2004లో పిచాయ్ గూగుల్ లో చేరారు. ఆయన నాయకత్వంలో సమిష్టి కృషితో గూగుల్ క్రోమ్ ను లాంచ్ చేశారు. 2008 లాంచ్ అయిన గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్‌గా విశేషమైన ఆదరణను పొందింది.