Google Ukraine Support Fund: గూగుల్ కంపెనీ గ్లోబల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు. సంక్షోభ సమయంలో ఆపన్నులకు అండగా నిలిచేందుకు గూగుల్ సిద్ధంగా ఉందంటూ ప్రపంచానికి సందేశం పంపాడు. యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న ఉక్రెయిన్ సంస్థలకు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు.
నాటో విషయంలో తలెత్తిన బేదాభిప్రాయలు చినికిచినికి గాలివానగా మారి ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించింది రష్యా. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే యుద్ధం కారణంగా నష్టపోతున్న ఎంట్రప్యూనర్లకు గూగుల్ అండగా ఉంటుందంటూ ఈ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ 2022 మార్చిలో ప్రకటించారు.
మార్చిలో చేసిన ప్రకటనకు తగ్గట్టుగానే యుద్ధంలో నష్టపోయిన స్టార్టప్‌లు ఎంట్రప్యూనర్లకు సపోర్ట్‌గా నిలిచేందుకు సుందర్ పిచాయ్ నడుం బిగించారు. ఈ మేరకు సాయం పొందేందుకు అర్హులైన ఉక్రెయిన్ ఎంట్రప్యూనర్ల వడపోత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని సుందర్ పిచాయ్ స్వయంగా వెల్లడించారు. మొదటి రౌండ్ 17 ఉక్రెయిన్ కంపెనీలు గూగుల్ నుంచి సాయం పొందేందుకు అర్హత సాధించాయి.
While in Warsaw, Poland in March, I announced our Ukraine Support Fund to help Ukrainian entrepreneurs maintain and grow their businesses in a time of war. Today we're welcoming the 1st recipients who will receive financing + mentoring from @GoogleStartups https://t.co/NQQELKCjHN
— Sundar Pichai (@sundarpichai) May 31, 2022
ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత అనేక కారొ్పరేట్ కంపెనీలు రష్యా విషయంలో కఠినంగా వ్యవహరించాయి. అక్కడ తమ వ్యాపార కలాపాలను నిలిపేశాయి. ఇదే సమయంలో యుద్ధం వల్ల నష్టపోయిన ఉక్రెయిన్‌కు సాయం చేసే విషయంలో స్పష్టమైన కార్యాచరణ పెద్దగా ప్రకటించలేదు. కానీ గూగుల్ ఇందుకు భిన్నంగా ఉక్రెయిన్‌లో నష్టపోయిన స్టార్టప్‌లకు సాయం చేయడం ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment