గూగుల్ స్మార్ట్ ఫోన్లకు ఇంకా టైమ్ ఉందట
న్యూయార్క్ : స్మాప్ట్ వేర్ దిగ్గజం గూగుల్ నుంచి సొంత స్మార్ట్ ఫోన్ రూపొందించే ప్రణాళికలేమి లేవని కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. నెక్సస్ డివైజ్ ల రూపకల్పనలో ఒరిజనల్ ఎక్విప్ మెంట్ మానుఫాక్చర్స్ తోనే కలిసి పనిచేస్తామని పిచాయ్ పేర్కొన్నారు. కాలిఫోర్నియాలోని కోడ్ కాన్ఫరెన్స్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. హార్డ్ వేర్ పార్టనర్లతోనే భవిష్యత్తులో కూడా కలిసి పనిచేసే ప్లాన్లు ఉన్నాయన్నారు. నెక్సస్ లో మరిన్ని పెట్టుబడులకు ప్రయత్నిస్తామని చెప్పారు. నెక్సస్ డివైజ్ లోనే ఎక్కువ దృష్టి సారిస్తామని చెప్పారు. ఫోన్లకు మించిన కేటగిరీలు తమ ముందు ఉన్నాయన్నారు.
ఆండ్రాయిడ్ అనేది ఓపెన్ ఎకో సిస్టమ్ అని, ప్రపంచంలో ఉన్న ప్రతి భాగానికి గ్లోబల్ ప్లేయర్ ఒకరే సమాధానం చెప్పలేరని పిచాయ్ తెలిపారు. ఇండియా, చైనాలో చాలా స్థానిక కంపెనీలు ఉన్నాయని, అక్కడ అవి చాలా బాగా విజయవంతం అవుతున్నాయన్నారు. నేటికాలంలో ఆండ్రాయిడ్ అతిపెద్ద ఎకో సిస్టమ్, ఆండ్రాయిడ్ లో ఓపెన్ విధానం కలిగిఉన్న కంపెనీలకు కృతజ్క్షతలని పిచాయ్ చెప్పారు. స్మార్ట్ ఫోన్, హార్డ్ వేర్ పరిశ్రమలు రెండు డిమాండ్ ఎక్కువ కలిగి ఉండి, పోటీతత్వంతో ముందుకు వెళ్తున్నాయన్నారు. ఇంటిలిజెంట్ వర్చువల్ ఫ్రెండ్స్ యాపిల్ సిరీ, మైక్రోసాప్ట్ కోర్ టనా వంటి వాటికి సమానంగా గూగుల్ అసిస్టెంట్ ప్రొగ్రామ్ ను పిచాయ్ ఇటీవలే ఆవిష్కరించారు. మూవీ టికెట్ల బుకింగ్ లాంటి ప్రతిరోజు చేసే పనులకు ఇంటర్నెట్ యూజర్లకు గూగుల్ అసిస్టెంట్ సహకరించనుంది.