న్యూయార్క్: ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ బాటలోనే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ముస్లింలకు మద్దతు పలికారు. అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు, ఇతర మైనారిటీలకు మద్దతివ్వాలన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ట్రంప్ ముస్లింలను అమెరికాలోకి అడుగుపెట్టనీయవద్దని చెప్పడం తెలిసిందే. దీనిపై పిచాయ్ స్పందిస్తూ, ఒక కంపెనీ, ఒక పురోగతి సాధించాలంటే అన్ని వర్గాలను కలుపుకు వెళ్లాలని సోషల్ మీడియాలో అన్నారు. పారిస్ దాడిని ప్రస్తావిస్తూ ఎవరో కొందరు చేసిన పనికి ముస్లింలందరినీ నిందించొద్దన్నారు.