సుందర్ పిచాయ్ శాలరీ ఎంతో తెలుసా?
బెంగళూరు: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టిన సుందర్ పిచాయ్ అమెరికాలోనే అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోగా ఘనత సొంతం చేసుకున్నారు. వేతనం కింద గూగుల్ సంస్థలో 199 మిలియన్ డాలర్ల (రూ. 1353.39 కోట్లు) విలువైన వాటాలు పొందడం ద్వారా ఈ ఘనత ఆయన సొంతమైంది. ఈ నెల 3న భారత సంతతికి చెందిన పిచాయ్ పేరిట గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 2,73,328 క్లాస్ సీ వాటాలు ఆయనకు గ్రాంట్ రూపంలో అందజేసింది. ఆ రోజున స్టాక్ మార్కెట్ ముగిసేనాటికి ఈ వాటాల విలువ 19.9 కోట్ల డాలర్లు. ఇందులో 375 క్లాస్ ఏ ఉమ్మడి వాటాలను 786.28 డాలర్ల చొప్పున, 3,625 క్లాస్ సీ మూలధన వాటాలను 768.84 డాలర్ల చొప్పున పిచాయ్ అమ్మేశారని ఆల్ఫాబెట్ సంస్థ తెలిపింది.
మొత్తంగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌లో సుందర్ పిచాయ్‌కి 650 మిలియన్ డాలర్ల (రూ. 4420.61 కోట్ల) విలువైన వాటాలు ఉన్నాయి. అయితే, గూగుల్ స్థాపకులు ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్‌కు కంపెనీలో ఉన్న నికర సంపదతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ఫోర్బ్స్ తెలియజేసిన వివరాల ప్రకారం పేజ్‌కు 34.6 బిలియన్ డాలర్లు, బ్రిన్‌కు 33.9 బిలియన్ డాలర్ల సంపద ఉంది. గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ షిండ్ట్‌కు కూడా మూడు బిలియన్ డాలర్ల సంపద ఉంది. సుందర్ పిచాయ్‌కే కాదు గతంలో ఆల్ఫాబెట్ సీఎఫ్ వోగా ఉన్న రూత్ పొరట్ కూడా భారీగా వేతనం పొందింది. గత ఏడాది మోర్గాన్ స్టాన్లీ చేరడానికి ముందువరకు ఆమెకు 38 మిలియన్ డాలర్ల వాటాలు వేతనంగా, 30 మిలియన్ వాటాలు బోనస్‌గా లభించాయి.