highest paid CEO
-
ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అత్యధిక వేతనాలు పొందుతున్న సీఈవోల్లో భారత సంతతికి చెందినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ, భారత సంతతికి చెందిన నికేశ్ అరోరా 2023లో అమెరికాలో అత్యధిక వేతనం పొందిన సీఈవోగా రెండో స్థానంలో నిలిచారు.బ్రాడ్‌కామ్ సీఈవో హాక్ టాన్ 162 మిలియన్ డాలర్ల వేతనంతో అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో ఉన్న నికేశ్ అరోరా వేతనం 151.43 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,260 కోట్లు). వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన విశ్లేషణ ప్రకారం.. అత్యధిక వేతనం పొందిన టాప్ 500 సీఈవోలలో 17 మంది భారతీయ సంతతి వ్యక్తులు ఉన్నారు.అడోబ్‌కు చెందిన శంతను నారాయణ్ అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ సంతతికి చెందిన సీఈవోగా రెండవ స్థానంలో ఉన్నారు. మొత్తం మీద 11వ ర్యాంక్‌ను పొందారు. నారాయణ్ వేతనం 44.93 మిలియన్ డాలర్లు. ఇక మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 24.40 మిలియన్ డాలర్ల వేతనం పొందగా ఆల్ఫాబెట్ సీఈవో భారత్‌లో జన్మించిన సుందర్ పిచాయ్ 8.80 మిలియన్ డాలర్లు వార్షిక వేతనం అందుకున్నారు.ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న నికేశ్ అరోరా మొట్టమొదటిసారిగా గూగుల్‌లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. 2014లో సాఫ్ట్‌బ్యాంక్‌కు నాయకత్వం వహించారు. సైబర్ సెక్యూరిటీ కంపెనీ అయిన పాలో ఆల్టో నెట్వర్క్స్కు 2018 నుంచి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన వేతనం ముఖ్యంగా షేర్లు, ఈక్విటీ అవార్డులతో కూడి ఉంటుంది. -
దేశ ఐటీ రంగంలో టాప్.. అత్యధిక వేతనం ఈయనదే..
దేశ ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ సింగిశెట్టి నిలిచారు. ‘మింట్’ నివేదిక ప్రకారం.. కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ గత సంవత్సరం వేతన పరిహారంగా 22.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకున్నారు. కంపెనీ ఫైలింగ్ ప్రకారం, రవి కుమార్ సింగిశెట్టి గత సంవత్సరం మొత్తంగా 22.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకోగా ఇందులో 20.25 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.169.1 కోట్లు) విలువైన షేర్లను అందుకున్నారు. గత ఏడాది కాగ్నిజెంట్ ఆదాయం రూ.19.35 బిలియన్ డాలర్లు ఉండగా ఇందులో సీఈవో రవి కుమార్ వేతన పరిహారం 0.11 శాతంగా ఉంది. ఇతర ఐటీ సీఈవోల వేతనాలు ఇలా.. విప్రో మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే రూ. 10.1 మిలియన్ డాలర్లు (రూ. 83 కోట్లు) హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో విజయకుమార్ 10.65 మిలియన్ డాలర్లు (రూ. 88 కోట్లు) అసెంచర్ సీఈవో జూలీ స్వీట్ 31.55 మిలియన్ డాలర్లు (రూ.263 కోట్లు) ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 6.8 మిలియన్లు ( రూ. 56.4 కోట్లు) టీసీఎస్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథన్ 3.5 మిలియన్ ( రూ. 29.16 కోట్లు) -
విప్రో కొత్త సీఈవో వేతనం ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: బెంగళూరుకు చెందిన ఐటీ దిగ్గజం విప్రో కొత్త సీఈవో థియెరీ డెలాపోర్ట్ అత్యధిక పారితోషికం అందుకునే సీఈవోగా నిలవనున్నారు. అంతేకాదు భారతీయ ఐటీ పరిశ్రమలో బెస్ట్ పెయిడ్ సీఈవోల జాబితాలో చోటు దక్కించుకోనున్నారు. జూలై 6 నుండి సీఈవో, ఎండీగా బాధ్యతలు స్వీకరించనున్న థియరీ, ఈ ఏడాది స్టాక్ ఆప్షన్ ప్రయోజనాలతోపాటు దాదాపు 50 కోట్ల రూపాయలు వేతనాన్ని పొందనున్నారు. 2025, జూలై 5 వరకు ఐదేళ్లపాటు కంపెనీ సీఈవోగా ఆయనను నియమించినట్లు తాజా కంపెనీ ఫైలింగ్ లో విప్రో తెలిపింది. విప్రో మొట్టమొదటి భారతీయేతర సీఈవో థియరీ వేతనంలో కంపెనీలు సీఈవోకు ఇచ్చే సాధారణ నగదు, స్టాక్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా అనేక భాగాలు ఉంటాయి. ప్రాథమిక(బేసిక్) వేతనం 9.12-11.9 కోట్లు (సంవత్సరానికి 1.07 మిలియన్ -1.4 మిలియన్ యూరోలు) రూపాయలు, టార్గెట్ వేరియబుల్ పే ఏడాదికి 14.4-21.3 కోట్లు (1.7-2.5 యూరోలు) రూపాయలు. దీంతోపాటు 3.6-4.7 కోట్ల రూపాయల ప్రవాస భత్యాన్ని కూడా కంపెనీ చెల్లించనుంది. అలాగే వన్-టైమ్ క్యాష్ అవార్డు కింద 3 మిలియన్ డాలర్లు లేదా 22.8 కోట్ల రూపాయలు (జూలై 31, 2020న, జూలై 31, 2021 రెండుసార్లు) అందిస్తుంది. కాగా మాజీ సీఈవో అబిద్ అలీ జెడ్ నీముచ్ వాలా 2020 సంవత్సరానికి స్టాక్ ఆప్షన్లతో సహా రూ .32.28 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ సీఈవోకు చెల్లించే వార్షికవేతనం కంటే ఇది మూడు రెట్లు ఎక్కువట. కాగా ఫ్రాన్స్‌లో జన్మించిన థియరీ డెలాపోర్ట్ విప్రోలో చేరకముందు కాప్ జెమినిలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇతర దేశీయ ఐటీ కంపెనీల సీఈవోల వేతనాలు : టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ జీతం గత ఆర్థిక సంవత్సరంలో 16.04 కోట్ల నుంచి 13.3 కోట్ల రూపాయలకు తగ్గింది. ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ ఈ ఆర్థిక సంవత్సరం జీతం 34.27 కోట్ల రూపాయలు. టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నాని గతేడాది 22.3 కోట్ల రూపాయల జీతం తీసుకున్నారు. 2018 లో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న ఐటీ సీఈవో ఈయన. -
సుందర్ పిచాయ్ శాలరీ ఎంతో తెలుసా?
బెంగళూరు: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టిన సుందర్ పిచాయ్ అమెరికాలోనే అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోగా ఘనత సొంతం చేసుకున్నారు. వేతనం కింద గూగుల్ సంస్థలో 199 మిలియన్ డాలర్ల (రూ. 1353.39 కోట్లు) విలువైన వాటాలు పొందడం ద్వారా ఈ ఘనత ఆయన సొంతమైంది. ఈ నెల 3న భారత సంతతికి చెందిన పిచాయ్ పేరిట గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 2,73,328 క్లాస్ సీ వాటాలు ఆయనకు గ్రాంట్ రూపంలో అందజేసింది. ఆ రోజున స్టాక్ మార్కెట్ ముగిసేనాటికి ఈ వాటాల విలువ 19.9 కోట్ల డాలర్లు. ఇందులో 375 క్లాస్ ఏ ఉమ్మడి వాటాలను 786.28 డాలర్ల చొప్పున, 3,625 క్లాస్ సీ మూలధన వాటాలను 768.84 డాలర్ల చొప్పున పిచాయ్ అమ్మేశారని ఆల్ఫాబెట్ సంస్థ తెలిపింది. మొత్తంగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్లో సుందర్ పిచాయ్‌కి 650 మిలియన్ డాలర్ల (రూ. 4420.61 కోట్ల) విలువైన వాటాలు ఉన్నాయి. అయితే, గూగుల్ స్థాపకులు ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్కు కంపెనీలో ఉన్న నికర సంపదతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ఫోర్బ్స్ తెలియజేసిన వివరాల ప్రకారం పేజ్‌కు 34.6 బిలియన్ డాలర్లు, బ్రిన్కు 33.9 బిలియన్ డాలర్ల సంపద ఉంది. గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ షిండ్ట్కు కూడా మూడు బిలియన్ డాలర్ల సంపద ఉంది. సుందర్ పిచాయ్కే కాదు గతంలో ఆల్ఫాబెట్ సీఎఫ్ వోగా ఉన్న రూత్ పొరట్ కూడా భారీగా వేతనం పొందింది. గత ఏడాది మోర్గాన్ స్టాన్లీ చేరడానికి ముందువరకు ఆమెకు 38 మిలియన్ డాలర్ల వాటాలు వేతనంగా, 30 మిలియన్ వాటాలు బోనస్‌గా లభించాయి.