టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. ఫలితాలు వెలువడక ముందే ఓ విషయాన్ని వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. కంపెనీ మాత్రం విశ్వసనీయమైన సమాచారాన్ని అందించే వనరుగా ఉండాలని, తన ఉద్యోగులను కోరినట్లు సమాచారం. ఎన్నికల వేళ రాజకీయ విభేదాలలో చిక్కుకోకుండా ఉండేందుకు పిచాయ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
గూగుల్‌పై ట్రంప్ ఆరోపణలు
ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజంపై విచారణ జరుపుతామని వెల్లడించారు. గూగుల్ తన గురించి చెడు కథనాలను, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ గురించి మంచి కథనాలను మాత్రమే వెల్లడిస్తోంది ఆరోపించారు.
అధ్యక్ష పీఠమెవరికో..
ఇప్పటికే ఒక సారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన.. ట్రంప్ మళ్ళీ అధ్యక్ష పదివి చేపడతారా?.. లేక 'కమలా హారిస్'ను ఆ పదవి వరిస్తుందా? అని ప్రపంచ దేశాలు ఉత్కఠతో ఎదురు చూస్తున్నాయి. కాగా ఇప్పటికే అమెరికాలో పోలింగ్ మొదలైపోయింది. ఫలితాలు త్వరలోనే వెల్లడవుతాయి. అమెరికా అధ్యక్ష పీఠమెవరిదనేది తెలిసిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment