1/22
సుందర్ పిచాయ్ అసలు పేరు పిచాయ్ సుందరరాజన్.
2/22
1972, జూన్ 10న తమిళనాడులోని మధురైలో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.
3/22
తల్లి లక్ష్మి, స్టెనోగ్రాఫర్..తండ్రి రేగునాథ పిచాయ్ బ్రిటిష్ హయాంలో జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీ(జీఈసీ)లో ఇంజినీర్‌గా పనిచేసేవారు.
4/22
1993లో అమెరికా వెళ్లి సుందర్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్స్‌లో ఎంఎస్, వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
5/22
2004లో గూగుల్ సంస్థలో ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ విభాగం ఉపాధ్యక్షుడిగా చేరారు.
6/22
ఆగస్టు 10, 2015లో పిచాయ్ గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. గూగుల్ ఆయన సారథ్యంలో ఇటీవల ‘జెమినీ’ అనే జనరేటివ్ ఏఐను ఆవిష్కరించింది.
7/22
టెక్‌ప్రపంచానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్‌తో గౌరవించింది.
8/22
2019 డిసెంబర్‌లో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సుందర్ 2022 సంవత్సరానికిగానూ 226 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.1850కోట్లకు పైమాటే) పారితోషికం అందుకున్నారు.
9/22
ఐఐటీ ఖరగ్‌పుర్‌లో బీటెక్ చూస్తున్నపుడు అంజలితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని చెప్పారు.
10/22
తన భార్య గురించి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘మేం ఖరగ్‌పుర్ ఐఐటీలో తొలిసారి కలిశాం. చాలా బిడియస్తుడినైన నన్ను ఆమే మార్చింది. తనకు ప్రపోజ్ చేసేటప్పుడు నా టెన్షన్ ఇప్పటికీ గుర్తే. నా మనసులో మాట అంజలికి చెప్పడం కన్నా, గూగుల్‌లో ఈ స్థానాన్ని సంపాదించడమే తేలిక అనిపిస్తోందిప్పుడు.
11/22
నా ప్రేమను అంగీకరించడం తన గొప్పతనం. అప్పటికి నేను ఆర్థికంగా స్థిరపడకపోయినా, నన్ను నమ్మింది. నా జీవితంలో ప్రతి కీలక సందర్భంలోనూ తనదే ముఖ్య పాత్ర. ఎన్నో ముఖ్య విషయాల్లో సందిగ్ధంలో ఉన్నప్పుడు అంజలే నా సలహాదారు.
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22