
న్యూఢిల్లీ: అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్లను రూపొందించడంపై దేశీ టెలికం దిగ్గజం జియోతో కలిసి పనిచేస్తున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయని ఆసియా పసిఫిక్ విలేకరులతో వర్చువల్ సమావేశంలో ఆయన వివరించారు. అయితే, ఎప్పుడు ప్రవేశపెట్టేదీ, ధర ఎంత ఉంటుందీ వంటి అంశాలను ఆయన వెల్లడించలేదు. చౌక డేటా రేట్లకు చౌక స్మార్ట్‌ఫోన్లు కూడా తోడైతే ఇంటర్నెట్‌ను దేశవ్యాప్తంగా మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు తోడ్పడనుంది.
ఇండియా డిజిటైజేషన్ ఫండ్ (ఐడీఎఫ్) కింద కేటాయించిన 10 బిలియన్ డాలర్ల నిధులను వినియోగించేందుకు ఉపయోగపడే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పిచాయ్ పేర్కొన్నారు. టెక్నాలజీలో కృత్రిమ మేథస్సు సాధనాల వినియోగంలో నైతికత పాటించే విషయంపై స్పందిస్తూ ప్రస్తుతం ఇవి ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని, తమ సంస్థ ఈ అంశంలో పారదర్శకంగా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. ఇండియా డిజిటైజేషన్ ఫండ్ (ఐడీఎఫ్) కింద కేటాయించిన 10 బిలియన్ డాలర్ల నిధులను (సుమారు రూ. 75,000 కోట్లు) వినియోగించేందుకు తోడ్పడే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment