
సాక్షి, విజయవాడ: పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన చేశారు. ఆ వీడియోను మేము విడుదల చేయలేదని.. ఎన్నికల కమిషన్ నుండి బయటకు వెళ్లలేదు.. అది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటామని సీఈవో ముకేష్ కుమార్ మీనా అన్నారు.
‘‘దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుండో బయటకు వెళ్లింది పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీవో, ఏపీవోలను సస్పెండ్ చేశాం. మాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదు. ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. టీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాం. బయట నాయకులు ఎవ్వరూ మాచర్లకు వెళ్లకూడదు ఎవ్వరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనీయొద్దని ఆదేశించాను’’ అని సీఈవో ముకేష్ కుమార్ మీనా చెప్పారు.

Comments
Please login to add a commentAdd a comment