మైక్రోసాఫ్ట్ సమస్య పరిష్కారం.. క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ ట్వీట్ | CrowdStrike CEO Tweet About Microsoft Outage, Says Windows BSOD Is Not A Cyber Attack | Sakshi
Sakshi News home page

Microsoft Outage: మైక్రోసాఫ్ట్ సమస్య పరిష్కారం.. క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ ట్వీట్

Published Fri, Jul 19 2024 6:02 PM | Last Updated on Fri, Jul 19 2024 6:26 PM

CrowdStrike CEO Tweet About Microsoft Outage

మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడిన సమస్య పలు రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఈ సమస్యను పరిష్కరించినట్లు క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ ట్వీట్ చేశారు.

సమస్యను గుర్తించామని, పరిష్కారం కూడా అమలు చేశామని క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ 'జార్జ్ కర్ట్జ్' వెల్లడించారు. ఈ ప్రభావం మ్యాక్, లినక్స్ హోస్ట్‌ల మీద ఎటువంటి ప్రభావం చూపలేదు. ఇది సైబర్‌టాక్ అటాక్ కాదు. వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ కస్టమర్‌లను చేరువలో ఉంటామని ఆయన అన్నారు.

మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్య భారతీయ విమాన, ఐటీ సేవలకు మాత్రమే కాకుండా బ్యాంకులు, టెలికాం, మీడియా సంస్థలు కూడా ఈ అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి, విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్‌ సమస్య ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఎవివిధ రంగాలపై ప్రభావం చూపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement