
అందాలు ఆరబోయడం అనేది ఇండస్ట్రీలో సర్వసాధారణ విషయం. అవకాశాలు రావాలంటే అందాల ఆరబోత తప్పనిసరి! గ్లామర్ షో చేస్తేనే కానీ దర్శకనిర్మాతల కంట పడరు అన్నట్లు తయారైంది సినీ ఇండస్ట్రీ పరిస్థితి. ఒక్క సినీఇండస్ట్రీ మాత్రమే కాదు బుల్లితెరది కూడా ఇంచుమించు అదే పరిస్థితి! సీరియల్స్ నుంచి సినిమాకు ప్రమోషన్ రావాలంటే గ్లామర్ షో చేయాల్సిందే!
మంగళ గౌరి మధువె అనే కన్నడ సీరియల్‌తో పాపులర్ అయిన నటి తనీశా కుప్పంద తన అందంతో 2012లోనే పారిజాత అనే సినిమాలో నటించే ఛాన్స్ పట్టేసింది. ఆ తర్వాత వరుస సినిమా ఛాన్సులు కూడా అందుకుంటోంది. ఇటీవల ఆమె పెంటగాన్ మూవీలో నటించింది. ఇందులో బోల్డ్ సన్నివేశాల్లో యాక్ట్ చేసింది నటి. ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కానుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న ఈ బ్యూటీకి ఓ యూట్యూబర్ నుంచి వింత ప్రశ్న ఎదురైంది.
'మీరు అడల్ట్ సినిమా చేస్తారా?' అని అడిగేసరికి నటి ఒక్కసారిగా అవాక్కైంది. 'నేనేమీ బ్లూ ఫిలిం స్టార్ కాదు. మీరిలాంటి ప్రశ్న ఎలా అడుగుతున్నారు? కన్నడ సినీ ఇండస్ట్రీలో ఎవరు న్యూడ్ మూవీస్ చేస్తున్నారు? ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎలా అడగాలనిపిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు' అని మండిపడింది. అసలు ఆ యూట్యూబర్‌కు ఇతరులను గౌరవించడం ఏమాత్రం తెలియనట్లుంది అని కామెంట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment