సాక్షి, హైదరాబాద్: సాధారణంగా అసెంబ్లీలో ఒకే అంశానికి సంబంధించి వివిధ పార్టీల వారు ప్రశ్నిస్తుంటారు. కొన్నిసార్లు ఐదారుగురు ఒకే అంశంపై ప్రశ్నిస్తారు. కానీ మంగళవారం ఒకే అంశాన్ని ఏకంగా 16 మంది లేవనెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా శ్మశాన వాటికలకు తీవ్ర కొరత ఉన్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు.
దీంతో స్పీకర్ కూడా దాన్ని గంభీరమైన సమస్యగా పరిగణించి ఎక్కువసేపు చర్చించేందుకు అవకాశమిచ్చారు. ఇంత మంది సభ్యులు ప్రశ్నించటాన్ని బట్టే ఇది ఎంతపెద్ద సమ స్యో అర్థమవుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. వెయ్యి ప్రాంతాల్లో వాటి పనులు సాగుతున్నాయన్నారు.
నిర్మాణ వ్యయంలో 25 శాతం లేదా రూ.5 లక్షలు.. ఏది ఎక్కువో అది భరిస్తే ఆ శ్మశాన వాటికకు దాతలు సూచించిన పేరు పెడతామన్నారు. ‘నరేగా’ పథకంలో భాగంగా వాటిల్లో వసతులు కల్పిస్తున్నట్టు వెల్ల డించారు. మరోవైపు రాష్ట్రంలో రూ.300 కోట్ల వ్యయంతో రైతు వేదికలు నిర్మిస్తు న్నామని వ్యవసాయ మంత్రి పోచారం వెల్లడించారు. మూడు నాలుగు గ్రామాలు ఓ క్లస్టర్‌గా, 2,635 క్లస్టర్‌లలో వీటిని నిర్మిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment