
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం నేడు (శుక్రవారం) ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రికి మరో అవకాశం ఇవ్వడంపై కెప్టెన్ విరాట్ కోహ్లి ఇదివరకే పూర్తి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో క్రికెట్ అభిమానులు ఒకింత అసహనంతో ఉన్నారు. రవిశాస్త్రిని తప్పిస్తేనే జట్టుకు మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కోహ్లి అనవసరంగా రవిశాస్త్రిని వెనకేసుకొస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారు. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో ‘సాక్రెడ్ గేమ్స్’ సీజన్-2 నిన్న (ఆగస్టు 15) విడుదలై దిగ్విజయంగా దూసుకుపోతోంది. ఆ సీరియల్‌లోని ఓ సన్నివేశాన్ని ఉదహరిస్తూ సోషల్ మీడియా వేదికగా కోహ్లి, రవిశాస్త్రిని బీభత్సమైన మీమ్స్‌తో ఆడేసుకుంటున్నారు.
(శాస్త్రికి మరో అవకాశం!)
‘సాక్రెడ్ గేమ్స్’ సీజన్-2లో ప్రధానంగా వివిధ సంస్థల్లో అంతర్గతంగా ఎలాంటి వ్యవహారాలు నడుస్తాయని చూపించారు. తొలి రెండు మూడు ఎపిసోడ్‌లలో గురు, శిష్యుల సంబంధాన్ని చక్కగా చూపించారు. అయితే, అసలు విషయం ఐదో ఎపిసోడ్‌లో బయట పడుతుంది. శిష్యుడు గణేష్ గాయితొండే, గురూజీ మధ్య ‘సంబంధం’ వెలుగుచూస్తుంది. ఇక ఈ సన్నివేశం తాలూకు ఫొటోను కోచ్ రవిశాస్త్రి, టీమిండియా కెప్టెన్ కోహ్లికి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ‘పోను పోను కోహ్లికి గురూజీ ప్రేమ దొరుకుందిలే..!’ అని ఒకరు.. ‘సాక్రెడ్ గేమ్స్‌లో శిష్యునికి గురూజీ ప్రేమ దొరికింది’ మరొకరు.. కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment