విరాట్ కోహ్లిపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వాఖ్యలు చేశాడు. కోహ్లి రెండు లేదా మూడు నెలల పాటు క్రికెట్‌కు బ్రేక్ ఇవ్వాలని రవిశాస్త్రి సూచించాడు. కోహ్లి ఇంకా ఐదేళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగతాడని భావిస్తున్నాను అని అతడు తెలిపాడు. "ఇంకా అతడికి 33 ఏళ్లే. కోహ్లికి ఇంకా మరో ఐదేళ్ల పాటు క్రికెట్‌లో మంచి భవిష్యత్తు ఉంది. అతడు ప్రస్తుతం బ్యాటింగ్‌పై దృష్టి పెట్టగలిగితే బాగా రాణించగలడు.
ఇటువంటి సమయంలో అతడు ప్రశాంతంగా ఉండాలి, అంతే కాకుండా అతడికి రెండు లేదా మూడు నెలలపాటు విశ్రాంతి అవసరం. అనంతరం కోహ్లి చెలరేగి ఆడుతాడని నేను భావిస్తున్నాను. మరో ఐదేళ్ల పాటు క్రికెట్‌లో అతడు రాణించగలడు. నేను ఒకప్పటి విరాట్‌ను చూడాలి అనుకుంటున్నాను" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో భారత్ ఓడిపోవడంతో టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక వెస్టిండీస్‌తో త్వరలో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో కోహ్లి భాగమై ఉన్నాడు.
చదవండి: పీటర్సన్ సునామీ ఇన్నింగ్స్.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లు.. కేవలం 38 బంతుల్లోనే
Comments
Please login to add a commentAdd a comment