పోలీసుగా ప్రభాస్‌.. ‘స్పిరిట్‌’ స్టోరీ లైన్‌ చెప్పేసిన సందీప్‌ రెడ్డి | Director Sandeep Reddy Vanga Leaked the storyline of his upcoming movie Spirit with Prabhas - Sakshi
Sakshi News home page

పోలీసుగా ప్రభాస్‌.. ‘స్పిరిట్‌’ స్టోరీ లైన్‌ చెప్పేసిన సందీప్‌ రెడ్డి

Feb 29 2024 11:05 AM | Updated on Feb 29 2024 11:36 AM

Sandeep Reddy vanga Leaked Prabhas Spirit Movie Storyline - Sakshi

సందీప్‌ రెడ్డి వంగా, ప్రభాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు కానీ.. సినిమాకి ‘స్పిరిట్‌’అనే టైటిల్‌ మాత్రం ఫిక్స్‌ చేశారు. ఆ తర్వాత ఈ మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక రూమర్‌ మాత్రం వైరల్‌ అవుతోంది. స్పిరిట్‌ ఓ హారర్‌ మూవీ అని.. ఇందులో ప్రభాస్‌ మాంత్రికుడిగా కనిపించబోతున్నాడనే వార్తలు గత కొన్నాళ్లుగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్‌పై తాజాగా దర్శకుడు సందీప్‌ రెడ్డి స్పందించాడు. 

ఓ బాలీవుడ్‌ సినిమా టీజర్‌ లాంచ్‌లో పాల్గొన్న సందీప్‌ స్పిరిట్‌ స్టోరీ లైన్‌ ఏంటో చెప్పేశాడు. ‘ప్రభాస్‌తో తెరకెక్కించబోతున్న పాన్‌ ఇండియా ఫిల్మ్‌ పనుల్లో బిజీగా ఉన్నాను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి వెళ్లనుంది. అందరూ అనుకున్నట్లుగా ఇది హారర్‌ మూవీ కాదు. ఓ నిజాయితీ గల పోలీస్‌ ఆఫీసర్‌ కథ.తెరపై సరికొత్త ప్రభాస్‌ని చూస్తారు’అని చెప్పారు. తమ అభిమాన హీరో తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారని తెలిసి ఫ్యాన్స్‌ సంతోషంతో ఉబ్బితబ్బిపోతున్నారు.  

ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాజా సాబ్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహన్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ పూర్తయిన తర్వాత ‘స్పిరిట్‌’లో నటిస్తారు. ప్రభాస్‌ నటించిన మరో పాన్‌ ఇండియా మూవీ ‘కల్కీ 2898 ఏడీ’ మే 9న రిలీజ్‌ కాబోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement