
అర్జున్‌రెడ్డి సినిమాతో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా మారారు సందీప్ రెడ్డి వంగా. ఆ చిత్రాన్ని బాలివుడ్‌లో షాహిద్ కపూర్‌తో రిమేక్ చేసి అక్కడ కూడా పెద్ద హిట్ కొట్టాడు. అయితే ఇపుడు సందీప్ రెడ్డి డైరెక్షన్‌లోనే ప్రభాస్ నటించనున్నారు.ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే. టీ సిరీస్, సందీప్ రెడ్డికి చెందిన నిర్మాణ సంస్ధ కూడా సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి.
భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. అయితే ఈ భారీ చిత్రానికి ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో భారీ రెమ్యూనిరేషన్ పొందుతున్నాడని బీ టౌన్ టాక్. ‘స్పిరిట్’ సినిమాకు ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్ల రూపాయల భారీ పారితోషికం అందుకోనున్నాడని బాలివుడ్ ట్రేడ్ టాక్.
ఇప్పటికే బాలివుడ్‌లో వంద కోట్ల రూపాయల రేంజ్‌లో రెమ్యూనిరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోలు పలువురున్న విషయం తెలిసిందే. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ఈ ‘స్పిరిట్’ సినిమాతో అత్యంత భారీ స్థాయి పారితోషికం అందుకుంటున్న స్టార్ హీరోగా నిలుస్తున్నాడని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment