
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని కశింకోట గోవిందరావు కాలనీలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మత్తు కోసం సర్జికల్ స్పిరిట్ తాగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వివరాలు.. గోవిందరావు కాలనీకి చెందిన కూనిశెట్టి ఆనంద్ రావ్ స్నేహితులతో పార్టీ చేసుకుందామని భావించారు. కిక్ కోసం మత్తు ఎక్కువగా ఉంటుందని స్పిరిట్‌ను తీసుకొని వచ్చాడు. కాగా పార్టీలో ఆరుగురు పాల్గొనగా.. నలుగురు స్పిరిట్ తాగారు. కాగా తాగిన వెంటనే తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురిలోముగ్గురు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా మృతి చెందిన వారిలో వడిసెల నూకరాజు, కూనిశెట్టి ఆనంద్, పెతకం శెట్టి అప్పారావులుగా గుర్తించారు.
చంద్రబాబుపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment