kasimkota mandal
-
విషాదం : మత్తు కోసం స్పిరిట్ తాగి ..
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని కశింకోట గోవిందరావు కాలనీలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మత్తు కోసం సర్జికల్ స్పిరిట్ తాగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వివరాలు.. గోవిందరావు కాలనీకి చెందిన కూనిశెట్టి ఆనంద్ రావ్ స్నేహితులతో పార్టీ చేసుకుందామని భావించారు. కిక్ కోసం మత్తు ఎక్కువగా ఉంటుందని స్పిరిట్‌ను తీసుకొని వచ్చాడు. కాగా పార్టీలో ఆరుగురు పాల్గొనగా.. నలుగురు స్పిరిట్ తాగారు. కాగా తాగిన వెంటనే తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురిలోముగ్గురు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా మృతి చెందిన వారిలో వడిసెల నూకరాజు, కూనిశెట్టి ఆనంద్, పెతకం శెట్టి అప్పారావులుగా గుర్తించారు. చంద్రబాబుపై కేసు నమోదు -
నిమ్మకాయ మింగి బాలుడు మృతి
విశాఖపట్టణం: పది నెలల బాలుడు అనూహ్యమైన పరిస్థితుల్లో మృతి చెందిన విషాదకర ఘటన విశాఖపట్టణంలో చోటు చేసుకుంది. నిమ్మకాయ మింగి శీల రోహన్ సాయి అనే బాలుడు మృతి చెందాడు. కశింకోట మండలం ఇందిరానగర్ కాలనీలో జరిగిన ఘటన అందరినీ కలచివేసింది. విశాఖపట్టణం మద్దెలపాలెంలో అత్తగారింట్లో ఉంటున్న శీల వరలక్ష్మీ.. తన కొడుకు రోహన్ సాయితో కలిసి కశింకోటలోని పుట్టింటికి వచ్చింది. రోహన్.. మంచంపై పెట్టిన నిమ్మకాయతో ఆడుకుంటూ ఒక్కసారిగా దాన్ని మింగేశాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలపడంతో వారు హతాశులయ్యారు. చిన్నారి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు. రోహన్ తండ్రి కనకేశ్వరరావు.. జమ్మూకాశ్మీర్ లో ఆర్మీలో పనిచేస్తున్నాడు.