పది నెలల బాలుడు అనూహ్యమైన పరిస్థితుల్లో మృతి చెందిన విషాదకర ఘటన విశాఖపట్టణంలో చోటు చేసుకుంది.
విశాఖపట్టణం: పది నెలల బాలుడు అనూహ్యమైన పరిస్థితుల్లో మృతి చెందిన విషాదకర ఘటన విశాఖపట్టణంలో చోటు చేసుకుంది. నిమ్మకాయ మింగి శీల రోహన్ సాయి అనే బాలుడు మృతి చెందాడు. కశింకోట మండలం ఇందిరానగర్ కాలనీలో జరిగిన ఘటన అందరినీ కలచివేసింది.
విశాఖపట్టణం మద్దెలపాలెంలో అత్తగారింట్లో ఉంటున్న శీల వరలక్ష్మీ.. తన కొడుకు రోహన్ సాయితో కలిసి కశింకోటలోని పుట్టింటికి వచ్చింది. రోహన్.. మంచంపై పెట్టిన నిమ్మకాయతో ఆడుకుంటూ ఒక్కసారిగా దాన్ని మింగేశాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలపడంతో వారు హతాశులయ్యారు. చిన్నారి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు. రోహన్ తండ్రి కనకేశ్వరరావు.. జమ్మూకాశ్మీర్ లో ఆర్మీలో పనిచేస్తున్నాడు.