సత్తుపల్లి : సత్తుపల్లి డివిజన్ పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల శాఖల డివిజన్ కార్యాలయాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ కార్యాలయంలో నిర్మించిన ఐటీడీఏ హాస్టల్ భవనాన్ని చూసి.. ఇరిగేషన్ శాఖ స్థలంలో హాస్టల్ భవనానికి ఎలా అనుమతించారని ఐడీ డీఈఈ శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించారు. అప్పటి కలెక్టర్ ఆదేశాలతో హాస్టల్ భవనం నిర్మించినట్లు ఆయన బదులిచ్చారు.
చూపులు కూడా కరువాయే...
‘ఓటుకు కోట్లు’ కేసులో పరస్పర ఆరోపణలు చేసుకున్న తరువాత తొలిసారిగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి అధికారిక కార్యక్రమంలో పాల్గొనడంతో అందరిచూపు ఈ ఇద్దరిపైనే ఉంది. ఎమ్మెల్యే సండ్ర జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఇతర టీఆర్‌ఎస్ నేతలతో ముచ్చటిస్తూ కనిపించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కనీసం ఒకరివైపు ఒకరు కూడా చూసుకోకపోవటం చర్చానీయాంశమైంది.
కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నగర పంచాయతీ చైర్‌పర్సన్ దొడ్డాకుల స్వాతి, ఎంపీపీలు జ్యేష్ట అప్పారావు, మోటపోతుల వెంకటేశ్వరరావు, వి.రజిత, జెడ్పీటీసీలు హసావత్ లక్ష్మి, గుగ్గులోతు భాషా, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
డివిజన్ కార్యాలయాలను ప్రారంభించిన మంత్రి
Published Sat, Aug 8 2015 3:02 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM
Advertisement