వైఎస్ఆర్ సీపీ నేత హత్యకు సుపారి, కుట్ర భగ్నం
Published Thu, Mar 13 2014 10:53 PM | Last Updated on Tue, May 29 2018 4:09 PM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీనివాసరెడ్డిపై హత్యకు కుట్రపన్నిన ఫాక్షన్ నేతలు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. కడప లోని పెద్ద ముడియం మండలం నాగరాజుపల్లెలో ఫ్యాక్షన్ గొడవల్ని పెంచి పోషిస్తూ.. వైఎస్ఆర్ సీపీ నేత హత్యకు ప్రణాళిక రచించిన రమణారెడ్డి కుట్రలను పోలీసులు భగ్నం చేశారు.
జిల్లాలోని బనగానపల్లె పాతపాడుకు చెందిన ఆరుగురు వ్యక్తులకు రమణారెడ్డి సుపారి ఇచ్చి శ్రీనివాసరెడ్డి హత్యకు కుట్ర పన్నారు. ఎన్నికల సమయంలో ఆ ప్రాంత నాయకులు కదలికలను పరిశీలిస్తున్న పోలీసులు ఈ హత్యాకుట్రను భగ్నం చేశారు.
Advertisement
Advertisement