జుక్కల్ నియోజకవర్గం
జుక్కల్ రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్ది హనుమంతు షిండే,తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే ఎస్.గంగారామ్‌పై విజయం సాదించారు. షిండే కి 41959 ఓట్ల మెజార్టీ వచ్చింది. షిండే 2009లో టిడిపి పక్షాన గెలిచారు. ఆ తర్వాత 2014 నాటికి టిఆర్‌ఎస్‌లో చేరి మళ్లీ పోటీచేసి విజయం సాదించారు.
తదుపరి 2018లో కూడా మరోసారి గెలుపొందారు. కాగా బిజెపి పక్షాన పోటీచేసిన మరో మాజీ ఎమ్మెల్యే అరుణతారకు దాదాపు 28 వేల ఓట్లు వచ్చాయి. ఈమె 1999లో టిడిపి ఎమ్మెల్యేగా ఉండేవారు. ఈసారి బిజెపిలోకి మారి పోటీచేశారు. షిండేకి 77584 ఓట్లు రాగా, గంగారామ్‌కు 35625 ఓట్లు వచ్చాయి.
1957 నుంచి 1972 వరకు జనరల్ సీటుగా ఉన్న జుక్కల్ 1978 నుంచి రిజర్వుడ్ నియోజకవర్గంగా మారింది. కాంగ్రెస్ నాయకుడు ఎస్.గంగారామ్ ఇక్కడ నాలుగుసార్లు గెలుపొందారు. ఇక్కడ 14 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ ఐదుసార్లు, తెలుగుదేశం నాలుగుసార్లు గెలవగా, టిఆర్‌ఎస్ రెండుసార్లు, ముగ్గురు ఇండ పిెండెంట్లు విజయం సాధించారు.
టిడిపి పక్షాన పండరీ రెండుసార్లు గెలిచారు. జనరల్ సీటుగా ఉన్నప్పుడు విఠల్‌రెడ్డి ఇండిపెండెంటుగా రెండుసార్లు గెలవడం విశేషం. జుక్కల్ జనరల్ సీటుగా ఉన్నప్పుడు రెండుసార్లు రెడ్లు, రెండుసార్లు బ్రాహ్మణ నేతలు గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గం రిజర్వు కావడంతో ఎస్.సి నేతలు గెలుపొందారు.
జుక్కల్ ఎస్సిలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment