hanumanth shinde
-
జుక్కల్ (SC) నియోజకవర్గంని పరిపాలించేది ఎవరు?
జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ది హనుమంతు షిండే,తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే ఎస్.గంగారామ్‌పై విజయం సాదించారు. షిండే కి 41959 ఓట్ల మెజార్టీ వచ్చింది. షిండే 2009లో టిడిపి పక్షాన గెలిచారు. ఆ తర్వాత 2014 నాటికి టిఆర్ఎస్లో చేరి మళ్లీ పోటీచేసి విజయం సాదించారు. తదుపరి 2018లో కూడా మరోసారి గెలుపొందారు. కాగా బిజెపి పక్షాన పోటీచేసిన మరో మాజీ ఎమ్మెల్యే అరుణతారకు దాదాపు 28 వేల ఓట్లు వచ్చాయి. ఈమె 1999లో టిడిపి ఎమ్మెల్యేగా ఉండేవారు. ఈసారి బిజెపిలోకి మారి పోటీచేశారు. షిండేకి 77584 ఓట్లు రాగా, గంగారామ్‌కు 35625 ఓట్లు వచ్చాయి. 1957 నుంచి 1972 వరకు జనరల్ సీటుగా ఉన్న జుక్కల్ 1978 నుంచి రిజర్వుడ్ నియోజకవర్గంగా మారింది. కాంగ్రెస్ నాయకుడు ఎస్.గంగారామ్ ఇక్కడ నాలుగుసార్లు గెలుపొందారు. ఇక్కడ 14 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ ఐదుసార్లు, తెలుగుదేశం నాలుగుసార్లు గెలవగా, టిఆర్ఎస్ రెండుసార్లు, ముగ్గురు ఇండ పిెండెంట్లు విజయం సాధించారు. టిడిపి పక్షాన పండరీ రెండుసార్లు గెలిచారు. జనరల్ సీటుగా ఉన్నప్పుడు విఠల్‌రెడ్డి ఇండిపెండెంటుగా రెండుసార్లు గెలవడం విశేషం. జుక్కల్ జనరల్ సీటుగా ఉన్నప్పుడు రెండుసార్లు రెడ్లు, రెండుసార్లు బ్రాహ్మణ నేతలు గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గం రిజర్వు కావడంతో ఎస్.సి నేతలు గెలుపొందారు. జుక్కల్ ఎస్సిలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
బాధిత చిన్నారులను చూసి కంటతడి పెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సింధే
నిజాంసాగర్/పిట్లం/పెద్దకొడప్గల్/బాన్సువాడ టౌన్/నిజామాబాద్ అర్బన్: అన్నాసాగర్ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింథే అన్నారు. మంగళవారం ఆయన బాన్సువాడ, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించారు. ప్రమాదంలో తల్లులను కోల్పోయిన చిన్నారులను చూసి ఎమ్మెల్యే తీవ్రంగా చలించి కంటతడి పెట్టారు. చదవండి👉🏾 అయ్యో! ఎంత ఘోరం.. అనారోగ్యంతో బాబు, ఆవేదనతో తల్లి.. ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడం బాధాకరం అన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలందరి గురుకుల పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతి చెందిన వారిలో ముగ్గురు రైతు బీమాకు అర్హులని, మిగతావారు టీఆర్ఎస్ సభ్యత్వం కల్గిన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట సొసైటీ చైర్మన్ హన్ముంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మరెడ్డి, సర్పంచ్ రమేష్, నాయకులు లచ్చిరెడ్డి, విజయ్, రహిమతుల్లా, విజయ్, విజయ్ దేయ్, పాల్గొన్నారు. చదవండి👉🏻 చదివింపులు.. రూ. అరకోటి! -
జుక్కల్ ఎమ్యెల్యేకు పితృవియోగం
జుక్కల్ (నిజామాబాద్ జిల్లా): నిజామాబాద్ జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే తండ్రి మాధవ్‌రావు షిండే అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున జుక్కల్‌లో ఆయన మృతి చెందారు. ఎమ్మెల్యే స్వగ్రామం జుక్కల్ మండలం డోన్గామ్లో తండ్రి అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు ఎమ్యెల్యే హనుమంత్ షిండే తెలిపారు. ఆయన అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలు పార్టీ నేతలు, ప్రముఖులు రానున్నట్లు సమాచారం. -
గులాబీ తోటలోకి సింధే
నిజాంసాగర్, న్యూస్‌లైన్ : టీఆర్ఎస్ ఖాతాలో మరో ఎమ్మెల్యే చేరారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే ఆదివారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన 320వాహనాల్లో సుమారు మూడు వేల మంది అనుచరులతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వెళ్లి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. దీంతో నియోజకవర్గంలోని టీఆర్ఎస్ కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. జుక్కల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలం అంతంతే. ఎమ్మెల్యే సింధే చేరికతో పార్టీ బలపడుతుందని భావిస్తున్నారు. టీఆర్ఎస్లో చేరి న వారిలో నిజాంసాగర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద, మద్నూర్ మండలాల టీడీపీ అ ధ్యక్షులు, సింగిల్ విండోల చైర్మన్లు, సర్పం చ్‌లు, నీటిసంఘాల చైర్మన్లు, పాఠశాల యాజమాన్య కమిటీల చైర్మన్లు, పార్టీ అనుబంధ సంఘాలు, కుల సంఘాల ప్రతిని ధులు ఉన్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్లో చేరిన ప్రముఖుల్లో డీసీసీబీ డెరైక్టర్ మోహన్‌రెడ్డి, గున్కుల్ సింగిల్ విండో చైర్మన్ దఫేదర్ రాజు, మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ పాకల్వార్ విజయ్, నల్లవాగు మత్తడి చైర్మన్ దుర్గారెడ్డి, నాయకులు వినయ్‌కుమార్, గంగారెడ్డి, విఠల్ తదితరులున్నారు. ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని కోరాం తెలంగాణ రాష్ట్రంలో లెండి ప్రాజెక్టు పనులతో పాటు కౌలాస్ కాలువల పనులను పూర్తి చేయాలని టీఆర్ఎస్ అధినే త కేసీఆర్‌ను కోరామని ఎమ్మెల్యే హ న్మంత్ సింధే తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన అనంతరం ఆయన ‘న్యూస్‌లైన్’ తో మాట్లాడారు. తెలంగాణ ప్రకటన త ర్వాత టీడీపీలోని పరిణామాలు తనను బాధించాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏ ర్పాటు కాకుండా చంద్రబాబుతోపాటు సీమాంధ్ర నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకోసం టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నామన్నారు. జుక్కల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం కోసం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత లెండి ప్రాజెక్టుతోపాటు కౌలాస్ కాలువలు, పిట్లం మండలంలోని వెంపల్లి మత్తడి పనులు చేపట్టాలని కేసీఆర్‌ను కోరామన్నారు. నియోజకవర్గం లో 40 గ్రామాలకు రోడ్లులేవని, ఆయా గ్రామాలకు బీటీ రోడ్లు వేయించాలని, నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశామన్నారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేస్తే కౌలాస్, లెండి పనులు పూర్తి చేయించే బాధ్యతను తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. -
కేసీఆర్ తో భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే భేటీ అయ్యారు. కేసీఆర్‌తో ఆదివారం సమావేశం అయిన షిండే సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇప్పటికీ స్పష్టమైన హామీ ఇవ్వని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిపై కూడా ఈ భేటీలొ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జుక్కల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభర్థిగా ఎన్నికైన షిండే మాత్రం చంద్రబాబు తీరుపై పూర్తి అసంతృప్తిగా ఉన్నారు. వచ్చే వారం హన్మంత్ నాయక్ టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.