గులాబీ తోటలోకి సింధే
నిజాంసాగర్, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ ఖాతాలో మరో ఎమ్మెల్యే చేరారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే ఆదివారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన 320వాహనాల్లో సుమారు మూడు వేల మంది అనుచరులతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వెళ్లి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. జుక్కల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ బలం అంతంతే. ఎమ్మెల్యే సింధే చేరికతో పార్టీ బలపడుతుందని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరి న వారిలో నిజాంసాగర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద, మద్నూర్ మండలాల టీడీపీ అ ధ్యక్షులు, సింగిల్ విండోల చైర్మన్లు, సర్పం చ్‌లు, నీటిసంఘాల చైర్మన్లు, పాఠశాల యాజమాన్య కమిటీల చైర్మన్లు, పార్టీ అనుబంధ సంఘాలు, కుల సంఘాల ప్రతిని ధులు ఉన్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్‌లో చేరిన ప్రముఖుల్లో డీసీసీబీ డెరైక్టర్ మోహన్‌రెడ్డి, గున్కుల్ సింగిల్ విండో చైర్మన్ దఫేదర్ రాజు, మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ పాకల్‌వార్ విజయ్, నల్లవాగు మత్తడి చైర్మన్ దుర్గారెడ్డి, నాయకులు వినయ్‌కుమార్, గంగారెడ్డి, విఠల్ తదితరులున్నారు.
ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని కోరాం
తెలంగాణ రాష్ట్రంలో లెండి ప్రాజెక్టు పనులతో పాటు కౌలాస్ కాలువల పనులను పూర్తి చేయాలని టీఆర్‌ఎస్ అధినే త కేసీఆర్‌ను కోరామని ఎమ్మెల్యే హ న్మంత్ సింధే తెలిపారు. టీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం ఆయన ‘న్యూస్‌లైన్’ తో మాట్లాడారు. తెలంగాణ ప్రకటన త ర్వాత టీడీపీలోని పరిణామాలు తనను బాధించాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏ ర్పాటు కాకుండా చంద్రబాబుతోపాటు సీమాంధ్ర నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకోసం టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నామన్నారు. జుక్కల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం కోసం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత లెండి ప్రాజెక్టుతోపాటు కౌలాస్ కాలువలు, పిట్లం మండలంలోని వెంపల్లి మత్తడి పనులు చేపట్టాలని కేసీఆర్‌ను కోరామన్నారు. నియోజకవర్గం లో 40 గ్రామాలకు రోడ్లులేవని, ఆయా గ్రామాలకు బీటీ రోడ్లు వేయించాలని, నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశామన్నారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేస్తే కౌలాస్, లెండి పనులు పూర్తి చేయించే బాధ్యతను తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు.