ఖమ్మం, న్యూస్‌లైన్: విద్యాశాఖలో పనిచేస్తున్న వారి ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును ఆసరాగా తీసుకుని నకిలీ మెడికల్ సర్టిఫికెట్‌లను సమర్పించి బిల్లులు కాజేసిన ఏడుగురు ఉపాధ్యాయులు, ఒక జూనియర్ అసిస్టెంట్‌పై వేటుపడింది. వారిని సస్పెండ్ చేస్తూ బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి రవీంద్రనాధ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిపై క్రిమినల్‌చర్యల కోసం పోలీస్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు డీఈవో తెలిపారు.
అక్రమార్కులకు సహకరించిన నలుగురు ఉన్నతాధికారులపై చర్యల కోసం ఆర్‌జేడీకి సిఫారసు చేసినట్లు కూడా తెలిపారు. సస్పెండ్ అయిన వారిలో బి.వెంకటరత్నం-ఎస్‌జీటీ, యూపీఎస్ నందిపాడు.., పి.వెంకటేశ్వరరావు-స్కూల్ అసిస్టెంట్, జడ్పీఎస్‌ఎస్ కందుకూరు.., వి.నగేష్- ఎస్‌జీటీ, పీఎస్ నాచారం.., టి.వెంగళరావు- ఎస్‌జీటీ, పీఎస్ నార్లవరం.., ఎం.వెంకటేశ్వర్లు- ఎస్‌జీటీ, పీఎస్ తిర్లాపురం.., చలమారావు-ఎస్‌జీటీ, పీఎస్ యర్రబోడు.., పి.జానీ- గ్రేడ్-2 హిందీపండిట్, ముత్తగూడెం.., ఎం.వెంకటేశ్వర్లు- స్కూల్ అసిస్టెంట్, ప్రభుత్వ పాఠశాల, చర్ల ఉన్నారు.
నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించిన ఉపాధ్యాయుల సస్పెన్షన్
Published Thu, Sep 26 2013 4:48 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement