సాక్షి, హన్మకొండ: తెలంగాణ బీజేపీలో ఇటీవల కీలక మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ చీఫ్‌గా కిషన్‌రెడ్డికి, ఎన్నికల ప్రచార సారధిగా ఈటలకు బీజేపీ హైకమాండ్ ప్రమోషన్ ఇచ్చింది. దీంతో, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలదళం వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈటల రాజేందర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అయితే, ఈనెల 8వ తేదీన ప్రధాని మోదీ వరంగల్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్ కాలేజీ మైదానాన్ని సందర్శించి సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి ప్రధాని మోదీ వస్తున్నారు. ఎన్నో ఏళ్ల కళ వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూమి పూజ చేస్తారు. బీజేపీలో సంస్థాగత మార్పులు రాబోయే కాలంలో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికే జరిగాయి.
తెలంగాణలో బీజేపీపై కొందరు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయి అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ చాలా బలంగా ఉంది. చాపకింద నీరులా పార్టీ విస్తరిస్తోంది. ఒక్కసారిగా పైకి వెళ్లి కిందకి పడిపోవడానికి.. బీజేపీ బలమేమీ సెన్సెక్స్ కాదు. బీజేపీలో భేదాభిప్రాయాలకు తావు లేదు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇది సమయంలో తెలంగాణ గడ్డపై తమ విజయపరంపర 2019 ఎంపీ ఎన్నికలతో మొదలైందన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటామని చెప్పారు. మునుగోడులోనూ నైతికంగా బీజేపీనే గెలిచిందన్నారు. ప్రధాని పర్యటనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించారని తెలిపారు. పార్టీ యంత్రాంగమంతా ప్రధాని సభను విజయవంతం చేస్తుందన్నారు. మోదీ సభకు ప్రజలు ఎక్కు సంఖ్యలో తరలి రావాలని సూచించారు. అలాగే, కుట్రలు, కుతంత్రాలు తిప్పి కొట్టే సత్తా తెలంగాణ జాతికి, బీజేపీ ఉందని స్పష్టం చేశారు.
మేము తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేస్తాం. కేసీఆర్ కుటుంబ పాలనను వదిలే ప్రసక్తే లేదు. చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరు. దేశంలోని స్వార్ధపరులు, స్వార్థ పార్టీలు, నేతల గురించి ప్రజలకు తెలుసు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు బాగా తెలుసు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఎన్నికలోచ్చినపుడు ఇష్టారీతిన హామీలు ఇస్తారు. కేంద్రం ధాన్యం కొనుగోలు కోసం డబ్బులు ఇచ్చినా రాష్ట్రం రైతులకు ఇచ్చే పరిస్తితి లేదు. ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయో తెలిసిన పార్టీ బీజేపీ. బీజేపీ నేతలు కలిసికట్టుగా ఉన్నారు. కలిసే పనిచేస్తాం, విజయం సాధిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: చేరికలపై దూకుడు.. టీ కాంగ్రెస్ సైలెంట్ ఆపరేషన్..
Comments
Please login to add a commentAdd a comment