
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రధాని మోదీ ప్రసంగం ముగిశాక సభా వేదికపై ఓ వైపు నిలుచున్న రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ భుజంపై చేయి వేసి పలకరించారు. కాసేపటికి వేదిక వెనక్కి వెళ్లాక కూడా ఈటల భుజంపై చేయి వేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘మేం అన్ని విషయాల్లో మీకు అండగా నిలుస్తాం. ధైర్యంగా పోరాడండి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయండి. పూర్తి సహకారం అందిస్తాం’’ అని ఈటలతో ప్రధాని మోదీ పేర్కొన్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సమయంలో పొంగులే టిని కూడా మోదీ పలకరించారు. ఇక సభా వేది క వెనకాల ఈటల, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలతో కేంద్ర మంత్రి గడ్కరీ కాసేపు మాట్లాడారు. కాగా శనివారం వరంగల్ పర్యటన ప్రధాని విచ్చేసిన విషయం తెలిసిందే. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మోదీ.. ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన బీజేపీ ‘విజయ సంకల్ప సభ’లో పాల్గొని మాట్లాడారు.
చదవండి: కేసీఆర్ గడీలు బద్దలు కొడతాం
Comments
Please login to add a commentAdd a comment