పిల్లి కళ్లు మూసుకొని పాలుతాగినట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపించడానికి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను ఎంత వేదిస్తున్నది, ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నది రికార్డ్ అవుతుందన్నారు. "ఒక్క రాష్ట్రంలో ఉండి నేనే అన్నీ అనుకుంటున్నావని. నిన్ను వీక్షించే వారు కూడా ఉన్నారు అని మర్చిపోకు." అంటూ వార్నింగ్ ఇచ్చారు. మల్కాజ్‌గిరిలో ఎవరు వచ్చినా.. ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టినా.. గెలిచేది బీజేపీనే అని.. ఈటల రాజేందర్ దీమా వ్యక్తం చేశారు.

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. నోరు, ఓళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడలంటూ హెచ్చరించారు. ఫోన్ ట్యాంపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేస్తున్న వసూళ్ల చిట్టా రికార్డ్ అవుందని అన్నారు. నడమంత్రపు సిరిలాగా ముఖ్యమంత్రి పదవి వచ్చిన రేవంత్ రెడ్డి.. రెండు నాల్కలధోరణితో మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమకు పెద్దన్న అని.. ఆయన ఆశీర్వాదం ఉంటేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఇటీవల రేవంత్ మాట్లాడిన ఈటల చెప్పుకొచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కొంపల్లి, అల్వాల్ ఫ్లై ఓవర్ కోసం 175 ఎకరాల రక్షణ రంగ భూమిని మోదీ కేటాయించారని చెప్పిన సీఎం .. మళ్లీ అదే నోటితో ప్రధానిని తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ కూడా అలానే మాట్లాడారని, ఆయనకు పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందంటూ హెచ్చరించారు.
నోరు, ఒళ్లు దగ్గర పెట్టుకోని జాగ్రత్తగా మాట్లాడాలని రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ హితవు పలికారు. అధికారం ఉందని ఏది పడితే అది మాట్లాడితే సహించడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శించిన రేవంత్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఖబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు.
చదవండి: ఇక నా రాజకీయం చూపిస్తా: సీఎం రేవంత్
పిల్లి కళ్ళు మూసుకొని పాలుతాగినట్టు సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని ఈటల మండిపడ్డారు. రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపించడానికి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను ఎంత వేధిస్తున్నది, ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నందంతా రికార్డ్ అవుతుందన్నారు. మల్కాజిగిరిలో ఎవరు వచ్చినా, ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టినా గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు.