కాంగ్రెస్‌ నేతలతో ఈటల ఆసక్తికర భేటీ.. హస్తం గూటికి ప్లాన్‌? | Etela Rajender Meet With Telangana Congress Leaders | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేతలతో ఈటల ఆసక్తికర భేటీ.. హస్తం గూటికి ప్లాన్‌?

Feb 17 2024 9:06 AM | Updated on Feb 17 2024 6:11 PM

Etela Rajender Meet With Telangana Congress Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అనంతరం, కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే కొందరు బీఆర్‌ఎస్‌ నేతలు హస్తం గూటికి చేరగా.. ఇతర పార్టీల నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నారనే చర్చ నడుస్తోంది. 

ఇక, తాజాగా పట్నం మహేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పట్నం మహేందర్‌ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో కలిసి బీజేపీ నేత ఈటల రాజేందర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్టు సమాచారం. దీంతో, ఈటల రాజేందర్‌ కూడా హస్తం గూటికి వెళ్తున్నారనే చర్చ మొదలైంది. అయితే, బీఆర్‌ఎస్‌ నుంచి ఈటల రాజేందర్‌ బయటకు వచ్చిన అనంతరం, ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే చర్చ నడిచింది. కానీ, అనూహ్యంగా ఈటల.. బీజేపీలో చేరారు. 

ఈ క్రమంలో హుజురాబాద్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి ఈటల గెలుపొందారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈటల రాజేందర్‌ రెండు స్థానాల్లో(హుజురాబాద్‌, గజ్వేల్‌) పోటీచేసి ఓడిపోయారు. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈటల పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల పార్టీ మారుతారా? లేక ఎన్నికల బరిలో నిలుస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.  ఇక, వీరి భేటీపై సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం ఊపందుకుంది. ఈటల కాంగ్రెస్‌లో చేరి కరీంనగర్‌లో నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement